- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్‌కు ఓటమి భయం పట్టుకుంది- బండి సంజయ్
దిశ, నాగార్జునసాగర్: తెలంగాణలోని నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలు జోరుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ బీజేపీ రోడ్ షో నిర్వహించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, పలువురు నాయకులు సాగర్ లోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇందులో భాగంగా బండి సంజయ్ గుర్రంపోడు మండలంలోని కొప్పోలు గ్రామం నుంచి చెపుర్, మోససంగి,పెద్దవూర మండలం లోని వెల్మగూడెం పెద్ద వరకు గ్రామాల మీదుగా రోడ్ షో నిర్వహిస్తూ ప్రచారం చేశారు.
తమ అభ్యర్థి డాక్టర్ రవి నాయక్ ని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఫండ్ కంటే కేంద్రం ఇచ్చే వాటానే ఎక్కువని, కేంద్ర వాటాపై తాను చెప్పేవి అబద్ధాలయితే తనపై కేసులు పెట్టాలన్నారు. ప్రజల కోసం బీజేపీ ఆందోళనలు చేస్తుంటే.. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను అక్రమ కేసులతో భయపెడుతున్నారని ఆరోపించారు. సాగర్‌లో మద్యం, డబ్బుతో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు గెలవాలని చూస్తున్నాయని బండి సంజయ్ విమర్శించారు. టీఆర్ఎస్‌కు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై సీఎం కేసీఆర్ చర్చకు సిద్ధమా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. తాము ప్రజల కోసం పోరాడుతుంటే తమపై కేసీఆర్ అక్రమ కేసులు పెట్టిస్తున్నారని, మద్యం, డబ్బులు పంచి టీఆర్ఎస్, కాంగ్రెస్ గెలవాలని చూస్తున్నాయని ఆయన ఆరోపించారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే.. కేంద్ర నిధులతో సాగర్ అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు.