నోరూరించే అరటి పండు కేసరి

by Shyam |   ( Updated:2023-07-19 11:52:22.0  )
నోరూరించే అరటి పండు కేసరి
X

అరటి పండుతో చాలా వంటకాలు చేసుకోవచ్చు. అరటి పండు కేసరి ఒక్కసారైనా రుచి చూస్తే అస్సలు మరిచిపోరు. ఇప్పుడు అరటి పండు కేసరి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్దాలు:

అరటి పండు -2
పాలు -మూడు కప్పులు
బొంబాయి రవ్వ – ఒక కప్పు
పంచదార -అర కప్పు
జీడిపప్పు -ఒక టేబుల్ స్పూన్
ఎండు ద్రాక్ష -ఒక టేబుల్ స్పూన్
యాలకుల పొడి -అర టీ స్పూన్
నెయ్యి -4 టేబుల్ స్పూన్స్

తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నెలో పాలు వేడి చేసుకోవాలి. మరోపక్క ఒక ప్యాన్‌లో నెయ్యిను వేడి చేశాక అందులో జీడిపప్పును దొరగా వేయించుకోవాలి. దానిలో ఎండుద్రాక్షను కూడా వేగించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో సన్నని మంటపై చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అరటి పండు ముక్కలను వేసుకుని రెండు నిమిషాల పాటు వేగించుకోవాలి. తర్వాత ఇప్పుడు అదే ప్యాన్‌లో రవ్వను వేసుకుని గోల్డెన్ కలర్‌ వచ్చేవరకు వేయించుకోవాలి.

ఇప్పుడు రవ్వలో వేడి చేసిన పాలు వేసుకుని కలపాలి. (ఒకవేళ పాలకు బదులు వాటర్‌ను తీసుకున్నా.. నీటిని వేడి చేసుకుని తీసుకోవాలి.) ఈ మిశ్రమం అంతా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు చక్కెరను వేసుకుని బాగా కలుపుకోవాలి. దీనిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, ఎండుద్రాక్ష, అరటిపండును వేసుకోవాలి. అనంతరం యాలకుల పొడిని వేసుకుని కలుపుకోవాలి. అనంతరం గిన్నెపై మూత పెట్టి రెండు నిమిషాలు సన్నని మంటపై ఉడికించి దించేసుకుంటే అరటిపండు కేసరి రెడీ..

అరటి పండుతో ఇన్ని ప్రయోజనాలా..?

Advertisement

Next Story

Most Viewed