చిత్ర పరిశ్రమలో విషాదం.. 'చిన్నారి పెళ్లికూతురు' బామ్మ ఇకలేరు

by Anukaran |   ( Updated:2021-07-16 04:05:44.0  )
balika vadhu bamma
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి, ‘చిన్నారి పెళ్లి కూతురు’ ఫేమ్ సురేఖ సిఖ్రి కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సిఖ్రి.. శుక్రవారం తుదిశ్వాస విడిచింది. బాలీవుడ్‌లో ఎన్నో సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1978 లో ‘కిస్సా కుర్సి కా’ చిత్రంతో తెరంగేట్రం చేసిన సురేఖ ‘తమాస్’ (1988), ‘మమ్మో ‘(1995) మరియు ‘బధాయ్ హో’ (2018) చిత్రాలోని నటనతో మూడుసార్లు జాతీయ చలనచిత్ర అవార్డులు ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో సహా పలు అవార్డులు అందుకున్నారు. క‌ల‌ర్స్ టీవీలో ‘బాలికా వ‌ధు’ సీరియ‌ల్ లో ఆమె చేసిన దాదిసా పాత్ర చిర‌స్మ‌ర‌ణీయ‌మైంది.

బామ్మగా సిఖ్రి నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 2018లో షూటింగ్‌ సమయంలో బాత్రూంలో జారిపడటంతో సురేఖ సిఖ్రికు మొదటిసారి బ్రెయిన్‌ స్ట్రోక్ వచ్చింది. ఆ తర్వాత దానినుంచి కోలుకుంటున్న సమయంలో ఇటీవల ఆమెకు మరోసారి బ్రెయిన్‌ స్ట్రోక్ రావడంతో ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆమె నటనకు గ్యాప్ ఇచ్చి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. 75 ఏళ్ల సురేఖ సిఖ్రి మరణంతో చిత్రసీమ విషాదంలో మునిగిపోయింది. పలువురు చిత్రసీమ ప్రముఖులు ఆమెకు నివాళులర్పిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed