మళ్లీ బాలయ్య జులుం.. అభిమానికి తప్పని దెబ్బలు

by srinivas |   ( Updated:2023-08-18 16:17:57.0  )
మళ్లీ బాలయ్య జులుం.. అభిమానికి తప్పని దెబ్బలు
X

దిశ వెబ్‌డెస్క్: నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినిమాలు, రాజకీయాలతోనే కాదు.. వివాదాలతో కూడా ఎప్పుడూ వార్తల్లో ఉంటూ ఉంటారు. అభిమానులు, కార్యకర్తలపై చేయి చేసుకుంటూ బాలయ్య ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారనే విషయం మనకు తెలిసిందే. గతంలో తనతో ఫొటో దిగడానికి వచ్చిన అభిమానులపై బాలయ్య చేయి చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

అయితే తాజాగా బాలయ్య మళ్లీ అదే పనిచేశారు. ఫొటో దిగడానికి వచ్చిన అభిమానిపై రెచ్చిపోయారు. సెల్‌ఫోన్ పట్టుకుని ఫొటో దిగడానికి వస్తున్న ఒక అభిమానిపై మళ్లీ చేయి చేసుకున్నారు. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండగా… తన నియోజకవర్గమైన హిందూపురం నియోజకవర్గంలో గత రెండు రోజులుగా బాలయ్య ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో ఫొటో దిగేందుకు సెల్‌ఫోన్ పట్టుకు వస్తున్న ఒక అభిమానిని బాలయ్య కొట్టారు. ఫొటో దిగేందుకు వస్తున్న సమయంలో ఒకసారి, రూమ్‌లో నుంచి బయటికి వెళ్లేటప్పుడు మరోసారి అభిమానిపై బాలయ్య చేయి చేసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు.. “ఇందులో కొత్తగా ఏం ఉంది. బాలయ్య ఇలా ఎన్నోసార్లు చేశారు కదా?.. బాలయ్యకు ఇది కామన్’ అని చర్చించుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed