భార్య కోసం కోహ్లి ఏం చేశాడో తెలుసా?

by Shiva |
భార్య కోసం కోహ్లి ఏం చేశాడో తెలుసా?
X

దిశ, స్పోర్ట్స్: కరోనా లాక్‌డౌన్ చాలా మందికి ఎన్నో నేర్పించింది. ముఖ్యంగా ఇంటి పని, వంట పని రాని భర్తలు ఈ లాక్‌డౌన్ సమయంలో అన్నీ నేర్చుకున్నారు. దీనికి టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా అతీతుడు కాదు. లాక్‌డౌన్ సమయంలోనే విరాట్ భార్య అనుష్క శర్మ పుట్టిన రోజు వచ్చింది. బయట బేకరీలు కూడా ఏవీ లేవు. ఉన్నా సరే అక్కడి నుంచి తెప్పించుకోవాలంటే కరోనా భయం. దీంతో కోహ్లి తొలిసారి కేక్ తయారు చేశాడంటా. కేక్ బాగుందని అనుష్క కూడా మెచ్చుకుందంటా. ఈ విషయం స్వయంగా విరాట్ వెల్లడించాడు. మయాంక్ అగర్వాల్‌తో పాల్గొన్న ఒక ఇంటర్వూలో ఈ విషయాలు వెల్లడించారు. ఇక టీం ఇండియాలో ప్రొటీన్ షేక్స్ ఎవరు బాగా చేస్తారని మయాంక్ ప్రశ్నించాడు. ‘ఈ ప్రశ్న ఎందుకు అడిగావో నాకు తెలుసు. ప్రొటీన్ షేక్స్ మొదట మీరు, తర్వాత నవదీప్ షైనీ, తర్వాత నేను బాగా చేస్తాను. నాకు నేను మీ ఇద్దరి తర్వాతే రేటింగ్ ఇచ్చుకుంటా’ అని కోహ్లి వెల్లడించాడు. కాగా, లాక్‌డౌన్ సమయంలో ఇంటికే పరిమితం అయ్యానని, బుక్స్ చదవడం, ఫిట్‌నెస్ కాపాడుకుంటూ సమయం గడిపినట్లు చెప్పాడు. ఈ ఇంటర్వూలో కొంత భాగాన్ని బీసీసీఐ తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.

Advertisement

Next Story