- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మార్కెట్లోకి బజాజ్ ఆటో అప్‌గ్రేడ్ కేటీఎం బైక్
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన సంస్థ బజాజ్ ఆటో ప్రీమియం మోటార్ సైకిల్ కేటిఎం 250 డ్యూక్ బైక్ అప్‌గ్రేడ్ వెర్షన్‌ను బుధవారం విడుదల చేసింది. ఈ సరికొత్త అప్‌గ్రేడెడ్ బైక్ డీఆర్ఎల్‌లతో పూర్తి ఫ్రెష్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ యూనిట్, డ్యుయెల్ ఛానల్ ఏబీఎస్ సూపర్ మోటో మోడ్, వన్ టచ్ స్టార్ట్ ఫంక్షనాలిటీతో వస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
అధునాతన ‘సూపర్ మోటో’ మోడ్ కేవలం ఒక్క బటన్ నొక్కగానే యాక్టివేట్ అవుతుందని, ముందు బ్రేక్ ఏబీఎస్‌ను నియంత్రిస్తుంది. వెనక బ్రేక్ పూర్తిగా బైక్ రైడ్ చేసే వ్యక్తి స్పీడ్‌ను పరిమితం చేసేలా ఉంటుందని కంపెనీ వివరించింది. ఈ సరికొత్త బైక్ రేసింగ్ స్టైల్ ప్రేరణతో తయారు చేయబడింది, హైటెక్ రేస్ ఇంజిన్ సామర్థ్యం దీని సొంతం, కేటీఎం 250 డ్యూక్‌లో కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన ఇంజిన్, పరికరాలు ఆకర్షణగా ఉంటాయని బజాజ్ ఆటో ప్రెసిడెంట్ సుమీత్ నారంగ్ పేర్కొన్నారు.
బుధవారం ఢిల్లీ మార్కెట్లో విడుదల చేసిన ఈ బైక్ ధరను రూ. 2.09 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. 2012లో భారత్‌లో ప్రవేశించినప్పటి నుంచి కేటీఎం మొత్తం 365 నగరాలు, 460 స్టోర్లలో విక్రయించబడింది. ఇప్పటివరకు కేటీఎం బైక్ 2.7 లక్షల యూనిట్లు అమ్ముడైనట్టు కంపెనీ వెల్లడించింది.