- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేసీఆర్‌ను బంగాళఖాతంలో కలిపే రోజు ముందుంది : ఎమ్మెల్యే పొదెం
దిశ, వెబ్‌డెస్క్ : ముక్కోటి ఏకాదశి సందర్బంగా భద్రాచలం రామయ్య సన్నిధిలో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. స్థానిక ఎమ్మెల్యే పొదెం వీరయ్య తనకు సమాచారం లేకుండా ఉత్సవాలు నిర్వహించడం ఎంటనీ ప్రభుత్వంపై మండిపడ్డారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించి ఉత్తర ద్వార దర్శనం నిర్వహించారని, సిగ్గులేని ప్రభుత్వం సిగ్గుమాలిన పనులు చేస్తుందన్నారు. భద్రాచలం పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నిరాషతో వెనుదిరిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తానన్న కేసీఆర్ భద్రాచలం వైపు ముఖం కూడా చూపించలేదన్నారు. గత ముఖ్యమంత్రుల హయాంలో జవాబుదారి తనం ఉండేదని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. ప్రోటోకాల్ వ్యవహారంపై అసెంబ్లీ, ప్రివిలైజ్ కమిటీకి కంప్లైంట్ చేస్తానని తెలిపారు. దేవస్థానంలో ఏళ్ళ తరబడి ఉద్యోగులు పాతుకు పోయారని, ఈ ఉత్సవాల్లో ఎంత ఖర్చు పెట్టారో రివ్యూ చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ వ్యవహారశైలిని ఆ రాముడే చూసుకుంటాడని, త్వరలోనే ఆయన్ను బంగాళాఖాతంలో కలిపే రోజు ముందుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.