- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీరియల్ ప్రేక్షకులకు బ్యాడ్‌న్యూస్
దిశ, వెబ్‌డెస్క్: సీరియల్ ప్రేక్షకులకు బ్యాడ్‌న్యూస్. నిన్న, మొన్నటివరకు ఎవ్రీడే ఏ ఎపిసోడ్ మిస్ కాకుండా చూసిన డై హార్డ్ ఫ్యాన్స్, ప్రజెంట్ సీరియళ్లు బంద్ కావడంతో అన్ ఈజీగా ఫీలవుతున్నారు. కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో సీరియల్ షూటింగ్స్‌కు ప్యాకప్ చెప్పగా, ప్రముఖ ఛానల్స్ మొత్తం సీరియల్స్ వచ్చే టైంలో కొత్త ఎపిసోడ్‌లను ప్లే చేయట్లేదు. ఈ నేపథ్యంలోనే ఏడాది, రెండేళ్ల కిందటి స్పెషల్ ఈవెంట్స్‌తోపాటు, టాప్ షోలను ఎంపిక చేసుకొని ప్రేక్షకులకు వినోదాన్ని నింపుతున్నాయి. దీంతో కరోనా ఎఫెక్ట్‌తో హోం క్వారంటైన్‌లో ఉంటున్న సీరియల్ అభిమానులు చాలా ఇబ్బందిగా ఫీలవుతున్నారు.
దేశంలో జనతా కర్ఫ్యూనకు వారంరోజుల ముందే సినిమా షూటింగ్‌లు ఆగిపోగా, సీరియల్ షూటింగ్స్ అడపాదడపా నడిచాయి. కానీ, జనతా కర్ఫ్యూ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ పొడిగించడంతో సీరియల్స్ మొత్తం ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకు ముందు షూట్ చేసిన నాలుగైదు ఎపిసోడ్‌లు మాత్రమే ఇప్పుడు ప్లే చేయగా తర్వాత నుంచి ఆ టైంలో అదే చానల్‌కు సంబంధించిన కామెడీ షోలు, స్పెషల్ ప్రోగ్రాంలు ప్లే చేస్తున్నారు. షూటింగ్ తీసిన షాట్లకు సైతం ఎడిటింగ్ వర్క్ లేకపోవడంతో మొత్తానికే సీరియళ్లను నిలుపుదల చేశారు. దీంతో కరోనా వైరస్ నివారణ అయ్యే వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు కనపడుతున్నాయి.
దాదాపు తెలుగు ప్రేక్షకులకు టీవీ సీరియల్స్ అలవాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇంత సంక్షోభం ఎప్పుడూ రాలేదు. కొంతమంది మహిళామణులు ఎన్నో సీరియల్స్‌ను ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చివరి వరకు ఒక్క ఎపిసోడ్ మిస్ కాకుండా చూసిన పరిస్థితులు బోలెడు ఉన్నాయి. 500 నుంచి వెయ్యి ఎపిసోడ్‌లు అయినా ఇంకా 2000 వేల ఎపిసోడ్ వరకు వెళ్లినా మొత్తం చూసి వాళ్లకు వాళ్లే రికార్డులు నెలకొల్పుకున్న రోజులు ఉన్నాయి. కానీ, కరోనా ఎఫెక్ట్ పుణ్యమా అని ఇంటి దగ్గర ఉంటూ సీరియల్స్ చూసే అవకాశాన్ని హండ్రెడ్ పర్సెంట్ అందిపుచ్చుకోవాలనుకున్న అమ్మలక్కలకు కనీసం ఇంకో నెలరోజుల వరకు సీరియల్స్ చూసే అవకాశమే లేకుండా పోయింది. దీంతో చూసేదేమీ లేక ఛానల్స్ ఇంతకు ముందు ప్రసారం చేసిన టీవీ షోలు, స్పెషల్ ప్రోగ్రాంలతో పాటు, సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు.
నేటి నుంచి దూరదర్శన్‌లో రామయణ్
నేటి నుంచి దూరదర్శన్ డీడీ ఛానల్‌లో రామాయణ్ సీరియల్ అలరించనుంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజల కోరిక మేరకు ఈ సీరియల్‌ను ప్రసారం చేస్తున్నారు. 1987లో మొదటిసారిగా దూరదర్శన్‌లో ప్రసారమైన రామయణ్.. మళ్లీ ఇప్పుడు వస్తోంది. శనివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఒక ఎపిసోడ్, మళ్లీ రాత్రి 9 నుంచి 10 వరకు మరో ఎపిసోడ్ ప్రసారం ఉంటుందని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు.