మరో 24 గంటల్లో సాధారణ స్థితికి: మంత్రి అవంతి

by srinivas |
మరో 24 గంటల్లో సాధారణ స్థితికి: మంత్రి అవంతి
X

విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ స్టైరిన్ గ్యాస్ లీక్ ప్రభావిత ఐదు గ్రామాల ప్రజలు ఇళ్లకు వెళ్లవద్దని మంత్రి అవంతి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఉండాలన్నారు. అక్కడ అన్ని వసతులు కల్పించామని మంత్రి తెలిపారు. స్టైరిన్‌ను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, మరో 24 గంటల్లో పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని మంత్రి వెల్లడించారు. వదంతులను నమ్మవద్దంటూ ప్రజలకు సూచించారు. గ్యాస్ లీక్ ఘటనలో ప్రస్తుతం 500 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని మంత్రి అవంతి తెలిపారు. పరిశ్రమ వద్ద పరిస్థితిని ఏడుగురు మంత్రుల బృందం సమీక్షిస్తోందన్నారు. కాగా, శనివారం వెంకటాపురం గ్రామస్తులు ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. బాధిత మృతదేహాలతో స్థానికులు పరిశ్రమ గేటు ఎదుట ధర్నాకు దిగారు.

Tags: lg polymers, minister avanthi, rehabilitation Centers, venkatapuram villagers, protest


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed