రెండో తరగతి బాలికను మింగేసిన డ్రైన్

by srinivas |

దిశ ఏపీ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లా మండపేటలో దారుణం చోటుచేసుకుంది. మండపేటకు చెందిన పలివెల దుర్గాప్రసాద్, పల్లవి దంపతులకు కుమార్తె చంద్రకళ(7), కుమారుడు ఉన్నారు. స్థానిక మూడో వార్డులోని ఇంటిలో అద్దెకు ఉంటున్న దుర్గాప్రసాద్‌ వడ్రంగి పని చేస్తుంటాడు. స్థానిక రామాహిందూ మున్సిపల్‌ స్కూల్లో చంద్రకళ రెండో తరగతి చదువుతోంది. నిన్న సాయంత్రం పాల ప్యాకెట్‌ కోసం పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని దుకాణం వద్దకు వచ్చింది. తిరిగి వెళ్తున్న సమయంలో పాప డ్రైన్ లో పడిపోయింది. పాప కోసం డ్రైన్ లో ఎంత గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

Advertisement

Next Story