మీరు నాకిచ్చే కానుక అదే.. చంద్రబాబు ట్వీట్

by srinivas |   ( Updated:2021-04-19 06:33:17.0  )
మీరు నాకిచ్చే కానుక అదే.. చంద్రబాబు ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు రేపు పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు ట్విట్టర్‌లో కీలక సందేశం ఇచ్చారు. కరోనా వ్యాప్తి కారణంగా బర్త్ డే వేడుకులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. నేతలు, అభిమానులు, కార్యకర్తలెవ్వరూ తన బర్త్ డే వేడుకలు నిర్వహించవద్దని సూచించారు.

‘నా పుట్టినరోజుకు ఒక ప్రత్యేకతను తీసుకురావడానికి మీరంతా చేపట్టే కార్యక్రమాలు అభినందనీయం. అందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అయితే ఇప్పుడు కరోనా నుంచి రక్షణ పొందడం చాలా అవసరం. అందుకే నా పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి సమావేశాలు నిర్వహించవద్దని తెలుగుదేశం పార్టీ నేతలను, కార్యకర్తలను కోరుతున్నాను. దయచేసి మీరంతా ఒకరికొకరు భౌతిక దూరం పాటిస్తూ సురక్షితంగా ఉండండి. మీ అందరి క్షేమమే మీరు నాకిచ్చే జన్మదిన కానుక’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed