- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ ఆదేశాలతో హుజూరాబాద్‌లో అరాచకాలు: బాబు మోహన్
దిశ, అందోల్: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే హుజూరాబాద్ బైపోల్లో టీఆర్ఎస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిందని, ఆ పార్టీ నాయకులు అరాచకాలను సృష్టించి, ఓటర్లను భయబ్రాంతులకు గురి చేశారని మాజీ మంత్రి బాబు మోహన్ ఆరోపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ పార్టీ వందల కోట్లు ఖర్చు చేయడం అవసరమా?.. ఈ ఒక్క స్థానంతో టీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోతుందా.. అంటూ ప్రశ్నించారు.
ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ వ్యవహరించిన తీరుకు నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు.. శనివారం జోగిపేటలోని గాంధీ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలను ధరించి బీజేపీ నేతలు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బాబు మోహన్ మాట్లాడుతూ.. పోలింగ్ ముగిసిన తర్వాత వీవీ ప్యాట్లు పనిచేయడం లేదన్న సాకుతో ఏజెంట్లకు తెలియకుండా, ఎలాంటి సెక్యూరిటీ లేకుండా.. కారులో ఎలా తరలిస్తారని ఆయన నిలదీశారు. ఓటమి భయంతోనే బస్సులో ఉన్న ఈవీఎంలను తరలించి, అనుకూలంగా ఓట్లు వేసుకునే ప్రయత్నం చేశారన్నారు. ఒక్కో ఓటరుకు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు ఇచ్చారని, అయినా ప్రజలు ధర్మంవైపు నిలబడ్డారని, ఈటలకు అండగా నిలిచారని బాబు మోహన్ ధీమా వ్యక్తం చేశారు.