- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
విరాట్ కోహ్లీని వెనక్కినెట్టిన పాకిస్తాన్ క్రికెటర్
దిశ, స్పోర్ట్స్ : అంతర్జాతీయ వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్‌ను బుధవారం ఐసీసీ ప్రకటించింది. దాదాపు నాలుగేళ్లుగా వన్డే క్రికెట్‌లో టాప్ ర్యాంకింగ్ బ్యాట్స్‌మాన్‌గా కొనసాగుతున్న టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని కోల్పోయాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఒక సెంచరీతో అద్భుతంగా రాణించిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ వన్డే టాప్ ర్యాంకింగ్ బ్యాట్స్‌మాన్‌గా నిలిచాడు. బాబర్ అజమ్ 865 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకోగా, కోహ్లీ 857 రేటింగ్ పాయింట్లతో 2వ స్థానానికి పరిమితం అయ్యాడు. వన్డే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ 825 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్లు జహార్ అబ్బాస్, జావెద్ మియాందాద్, మహమ్మద్ యూసుఫ్ తర్వాత నెంబర్ వన్ ర్యాంకును సాధించిన బ్యాట్స్‌మాన్‌గా బాబర్ అజమ్ రికార్డు సృష్టించాడు. మరోవైపు సఫారీలపై పరుగుల వరద పారించిన ఫకర్ జమాన్ కెరీర్ బెస్ట్ 7వ ర్యాంకుకు చేరుకున్నాడు.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్
బ్యాట్స్‌మాన్
1. బాబర్ అజమ్ (865)
2. విరాట్ కోహ్లీ (857)
3. రోహిత్ శర్మ (825)
4. రాస్ టేలర్ (801)
5. ఆరోన్ ఫించ్ (791)
6. జానీ బెయిర్‌స్టో (785)
7. ఫకర్ జమాన్ (778)
7. ఫాఫ్ డు ప్లెసిస్ (778)
9. డేవిడ్ వార్నర్ (773)
9. షాయ్ హోప్ (773)
బౌలర్స్
1. ట్రెంట్ బౌల్ట్ (737)
2. ముజీబుర్ రెహ్మాన్ (708)
3. మాట్ హెన్రీ (691)
4. జస్ప్రిత్ బుమ్రా (690)
5. మెహదీ హసన్ (668)
6. కగిసో రబాడ (666)
7. క్రిస్ వోక్స్ (665)
8. జోష్ హాజెల్‌వుడ్ (660)
9. పాట్ కమిన్స్ (646)
10. మహ్మద్ అమిర్ (638)
ఆల్‌రౌండర్లు
1. షకీబుల్ హసన్ (408)
2. బెన్ స్టోక్స్ (295)
3. మహ్మద్ నబీ (294)
4. క్రిస్ వోక్స్ (273)
5. రషీద్ ఖాన్ (270)
6. మిచెల్ సాంట్నర్ (268)
7. ఇమాద్ వాసిమ్ (263)
8. కొలిన్ డి గ్రాండ్‌హోమ్ (257)
9. రవీంద్ర జడేజా (245)
10.షాన్ విలియమ్స్ (238)