విశాఖలో విఎస్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందా -అయ్యన్న 

by srinivas |
విశాఖలో విఎస్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందా -అయ్యన్న 
X

విశాఖలో రాజధానిపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్పందించారు. ట్విట్టర్ వేదికగా వైసీపీ నేతలపై ఘాటు విమర్శలు చేశారు. విశాఖ భూములపై కన్నేసి రాజధాని అంశం లేవనెత్తారని దుయ్యబట్టారు. ఆయన ఏమని ట్వీట్ చేశారో కింద ఉంది చదవండి.

విజయమ్మను ఓడించినందుకు దేవుడు విధించిన శిక్షే హుద్ హుద్ అంటూ రాక్షస మనస్తత్వాన్ని బయటపెట్టిన వైకాపా నాయకులు ఇప్పుడు విశాఖ పై కపట ప్రేమ నటిస్తున్నారు. మీ ప్రేమ ఉత్తరాంధ్ర ప్రజలపై కాదు ఇక్కడి భూమిపై మాత్రమే. విజయనగరానికి తలమానికమైన మాన్సాస్ ట్రస్ట్ ని చెరబట్టారు. 50 వేల కోట్ల ఆస్తులు కలిగిన ట్రస్ట్ పై విజయసాయిరెడ్డి కన్నుపడింది.

విశాఖలో కబ్జాలు, భూదందాల పర్వం మొదలయ్యింది. విశాఖని విజయసాయిరెడ్డి రియల్ ఎస్టేట్ దందాకు అడ్డగా మార్చుకున్నారు.పట్టుబడిన వాళ్ళు నా వాళ్ళు కాదంటూ ఆయన ఇస్తున్న స్టేట్మెంట్ చూస్తే నవ్వొస్తుంది. అంటే పట్టుబడకుండా దందా చేస్తున్న వాళ్ళు మాత్రమే మీ వాళ్ళా విజయసాయిరెడ్డి గారు అంటూ ట్వీట్ చేశారు అయ్యన్నపాత్రుడు.

Advertisement

Next Story

Most Viewed