- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తట్టుకోలేకే దాడులు.. జగన్‌పై మాజీ మంత్రి ఫైర్
దిశ, ఉత్తరాంధ్ర: టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నాయకులు చేసిన దాడిని మాజీమంత్రి, టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఖండించారు. పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రం అప్పుల పాలయిందని, ప్రజా వ్యతిరేకతను, విమర్శలను తట్టుకోలేకే ఫ్యాక్షనిస్టు ముఖ్యమంత్రి తమ పార్టీ నాయకులపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా డీజీపీ వైఫల్యమని, పోలీసులు దగ్గరుండి దాడులు చేయించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయలేని డీజీపీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
విజయసాయిరెడ్డి, కె.కె.రెడ్డి ఇళ్లపై టీడీపీ శ్రేణులు దాడులు చేస్తే వారు విశాఖపట్నంలో తిరగగలరా? అని ప్రశ్నించారు. టీడీపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, తమ నాయకులు ఎన్టీఆర్ , చంద్రబాబు ఇటువంటి సంస్కృతి నేర్పలేదని అయ్యన్నపాత్రుడు చెప్పారు. ఏపీ పోలీసులకు చేతగాక విశాఖ మన్యంలోకి తెలంగాణ పోలీసులు వచ్చారా? అని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులు చింతపల్లి అడవుల్లో కాల్పులు జరిపితే, ఏపీ పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.