రామమందిరం డొనేషన్స్@రూ.230కోట్లు

by Anukaran |   ( Updated:2021-01-29 10:24:54.0  )
రామమందిరం డొనేషన్స్@రూ.230కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్ : అయోధ్య రామమందిరానికి సంబంధించి ఏ విషయమైనా ప్రస్తుతం వైరల్‌గా మారుతోంది. ఆలయ నిర్మాణానికి విరాళాలు అందించాలని ట్రస్టు సభ్యులు పిలుపు నివ్వడంతో దేశ, విదేశాల నుంచి డొనేషన్లు వెల్లువెత్తాయి.

ఇప్పటివరకు వచ్చిన ఫండ్ విలువ సుమారు రూ.230 కోట్లు ఉంటుందని రామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్ మెంబర్ స్వామి గోవింద్ దేవ్‌గిరి శుక్రవారం ప్రకటించారు. జనవరి 15న స్వచ్ఛంద విరాళాలు అందించాలని పిలుపునివ్వగా దేశవ్యాప్తంగా వచ్చిన నగదు విలువ ఈ మేరకు చేరిందని ఆయన తెలిపారు.

Advertisement

Next Story