- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అయోధ్యకు బయల్దేరిన మొదటి ట్రైన్.. 1400 మంది ప్రయాణికులతో భారీ ఏర్పాట్లు
దిశ, ఫీచర్స్: భారత ప్రధాని మోడీ చేతుల మీదుగా జనవరి 22 వ తేదీన అయోధ్యలోని బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ అద్భుతమైన ఘట్టానికి వీక్షించడానికి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు వేయికళ్లతో ఎదురు చూశారు. 500 ఏళ్ల నాటి కల సాకారం కావడంతో ఈ కార్యక్రమాన్ని రామ్ భూమి ట్రస్ట్ ఎంతో మంది ప్రముఖులను ఇన్వైట్ చేశారు. సినీ సెలబ్రిటీస్ రాజకీయనాయకులు, బిజినెస్‌మెన్‌లు ఇలా రంగాల వారీగా అయోధ్యకు చేరుకుని సందడి చేశారు.
అయితే ప్రారంభోత్సవం నేపథ్యంలో కొంతకాలం పాటు నిర్మాణ పనులు నిలిపి వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అయోధ్యలో మిగతా ఆలయ నిర్మాణ పనులు పున:ప్రారంభించారు. గుడి మొదటి అంతస్తులో నిర్మించబోయే రాముడి దర్బార్ తో పాటు రెండో అంతస్తు పనులు కూడా మొదలు కానున్నాయి. ఈ ఏడాది డిసెంబరు నాటికి ఆలయ నిర్మాణ పనులు కంప్లీట్ అవుతాయని మందిర నిర్మాణ కమిటీ సభ్యులు రీసెంట్‌గా వెల్లడించారు.
అయితే దేశవ్యాప్తంగా ప్రజలు బాల రాముడిని దర్శించుకోవటానికి అయోధ్యకు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయోధ్యకు ప్రయాణికులతో మొదటి ట్రైన్ బయల్దేరింది. 1400 మంది ప్రయాణికులతో ఈ ట్రైన్ ప్రారంభం కావడం విశేషం. అయోధ్యకు చేరుకునే రైలు కోసం రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అయోధ్య దర్శనం తర్వాత తిరిగి ఈ ట్రైన్ 9వ తారీకున సికింద్రబాద్‌కు రానున్నట్లు రైల్వే అధికారులు తాజాగా వెల్లడించారు.