రామమందిర ప్రారంభోత్సవం.. ఆ 84 సెకన్లే కీలకం

by samatah |   ( Updated:2024-01-22 03:51:53.0  )
రామమందిర ప్రారంభోత్సవం.. ఆ 84 సెకన్లే కీలకం
X

దిశ, నేషనల్ బ్యూరో: రామమందిర ప్రారంభోత్సవానికి మరి కాసేపట్లో తెరపడనుంది. ఈ వేడుకకు హాజరవ్వడానికి ఇప్పటికే భారత్, విదేశాలకు చెందిన ప్రతినిధులు అయోధ్యకు చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం 10:55నిమిషాలకు అయోధ్య రామాలయంకు చేరుకుంటారు. అయితే విగ్రహ ప్రతిష్టాపనకు శుభ సమయం కేవలం 84 సెకన్ల పాటు ఉండనుంది. మధ్యాహ్నం 12:29:03 నుంచి12:30:35 గంటల వరకు మాత్రమే శుభ సమయంగా ఉంది. ఈ 84 సెకన్లలోనే ప్రాణప్రతిష్టకు సంబంధించిన కీలక ఘట్టం ఆవిష్కృతమయ్యే అవకాశం ఉంది. పండితులు దీనిని ఎంతో శుభ ముహూర్తంగా పేర్కొంటున్నారు. ఈ సమయాన్ని కాశీ జ్యోతిష్కుడు పండిట్ గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు150కి పైగా సంప్రదాయాలకు చెందిన సాధువులు, మత పెద్దలు, గిరిజన సంప్రదాయాలకు చెందిన 50 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. శంకుస్థాపన అనంతరం ఆలయాన్ని నిర్మించిన కార్మికులతో ప్రధాని మోడీ సమావేశమవుతారు.

Advertisement

Next Story

Most Viewed