- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అయోధ్య వెళ్లేవారికి బిగ్ అలర్ట్.. ఆ పాస్ ఉంటేనే లోపలికి ఎంట్రీ..!
దిశ, డైనమిక్ బ్యూరో: అయోధ్యలో అపూర్వ ఘట్టానికి సర్వం సిద్ధం అవుతున్నది. ఎన్నో శతాబ్దాల ఎదురుచూపులకు తెరదించుతూ మరో మూడు రోజుల్లో అయోధ్యలో శ్రీరాముని మందిరం ప్రారంభోత్సవం జరగబోతున్నది. ఈ అద్వితీయ ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు అనేక మంది అతిథులకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు అందజేసింది. అయితే ఈనెల 22 జరగబోయే ప్రారంభోత్సవానికి హాజరయ్యే అతిథులకు ట్రస్టు కీలక సూచన చేసింది. ఎంట్రీ పాసులు ఉన్నవారికి మాత్రమే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అనుమతి ఉంటుందని వెల్లడించింది.
ఈ కార్యక్రమం కోసం ఆహ్వానితులకు ఎంట్రీ పాసులు, క్యూఆర్ కోడ్‌లు శుక్రవారం నాడు అధికారికంగా విడుదల చేశారు. వీటిని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానించబడిన విశిష్ట అతిథులకు వారి పేరుతో అందజేయనున్నారు. ఎంట్రీ పాసుపై ఉన్న క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాతే వివరాలు సరిపోలితేనే అతిథులను లోపలికి అనుమతి ఇవ్వనున్నారు. కేవలం ఆహ్వాన పత్రిక ద్వారానే కార్యక్రమానికి అనుమతి ఇవ్వబడదని భద్రతా రీత్యా ఈ క్యూఆర్ కోడ్ ఎంట్రీ జాగ్రత్తలు తీసుకున్నట్లు ట్రస్టు పేర్కొంది.