- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రామ మందిర ప్రారంభోత్సవ వేళ సంచలన పరిణామం.. ఆ ఐదుగురు కీలక వ్యక్తులకు ఆహ్వానం..!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అయోధ్య రామ మందిర ఫీవర్ నడుస్తోంది. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో రామ్ లల్లా (బాల రాముడు) ప్రాణ ప్రతిష్ట వేడుక జరగనుండటంతో ప్రస్తుతం ఎక్కడ చూసిన దీనికి సంబంధించిన చర్చే జరుగుతోంది. ఇప్పటికే రామ మందిరం ప్రారంభోత్సవ వేడుకకు సర్వం సిద్ధం అయ్యింది. పలువురు దేశ, విదేశీ ప్రముఖులు ఈ కీలక ఘట్టంలో పాల్గొనేందుకు హాజరు అవుతున్నారు. ఈ క్రమంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నో ఏళ్లుగా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న అయోధ్య రామ మందిర జన్మభూమి-బాబ్రీ మసీద్ కేసులో చార్మిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని రామ్ లల్లా వేడుకకు ప్రభుత్వ గెస్ట్‌లు ఆహ్వానించారు.
ఈ సంచలనాత్మక తీర్పు వెలువరించిన అప్పటి సీజేఐ రంజన్ గొగొయితో పాటు ధర్మాసనంలోని ప్రస్తుత సీజేఐ చంద్రచూడ్, మాజీ సీజేఐ బోబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లను ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. మరీ ఈ వేడుకు వీరు హాజరు అవుతారో లేదా చూడాలి. కాగా, 2019 నవంబర్ 9వ తేదీన అప్పటి సీజేఐ రంజన్ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం రామ మందిర జన్మభూమి కేసులో సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయోధ్యలోని 2.77 ఎకరాల స్థలం రామ్ లల్లాకే చెందుతోందని.. ఈ స్థలాన్ని రామ మందిర నిర్మాణం కోసం హిందువులకు కేటాయిస్తున్నట్లు సంచలన తీర్పు వెలువరించింది. దీంతో అక్కడ అయోధ్య క్షేత్ర ట్రస్ట్ రామ మందిర నిర్మాణం చేపట్టింది.