- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాటిని ఒకసారి వాడినంక మళ్లీ వాడొద్దు.. ఆరోగ్య సమస్యలొస్తాయి జాగ్రత్త: సీఐ
దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గ పరిధి అమ్రాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల చేత ఆజాది అమృత్ మహోత్సవ కార్యక్రమం నేషనల్ గ్రీన్ కార్ప్స్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సుధారాణి ఆధ్వర్యంలో స్టాఫ్ మరియు విద్యార్థులు అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ ఆది రెడ్డి పాల్గొని హోటల్స్ వద్ద.. పండ్లు విక్రయించే వారికి, ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకసారి వాడిన ప్లాస్టిక్ వస్తువులను తిరిగి వాడొద్దని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి నల్లమల పర్యావరణం కాపాడడం అందరి బాధ్యతని సందేశాన్నిచ్చారు. వాయు కాలుష్యాన్ని తగ్గించాల్సిందేనని.. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తుచేశారు. ప్లాస్టిక్ ను ఒకసారి వాడిన తర్వాత పదేపదే వాడడం ద్వారా ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని.. వీలైతే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మర్చిపోవాలని గుర్తు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకటయ్య ,శివ శంకర్, విష్ణు, కిరణ్, శంకర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.