- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రామాల్లో ఆటోలు దగ్దం.. అసలు ఏమైంది
దిశ, ముధోల్: బైంసా అల్లర్ల ప్రభావం చుట్టుపక్కల పల్లెటూర్ల పై పాకిందా… అన్న సందేహం కలుగుతుంది. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పార్డి (బి) గ్రామంలో బుధవారం రాత్రి 1 గంట సమయంలో గుర్తు తెలియని దుండగులు టవేరా వాహనాన్ని పెట్రోల్ పోసి నిప్పంటించారు. అలాగే నిన్న రాత్రి 1:30 సమయంలో బైంసా మండలం మహాగాంగ్రామం లో మళ్లీ అదే సంఘటన చోటు చేసుకుంది.
మహాగాం గ్రామంలో రెండు ఆటోలు,ఓక హోటల్ ని గుర్తుతెలియని దుండగులు కాల్చి వేయడం జరిగింది. ఇంటి చుట్టూ ఉన్న పక్కవాళ్ళు నిద్ర నుంచి లేచి చూడగా వాహనాలు, హోటల్ కాలిపోవడం కనిపించాయి. వెంటనే వాహనం యజమానూలు వచ్చి, నీళ్లు పోసి మంటల్ని ఆర్పెసారు. అనతరం గ్రామ సర్పంచ్ కు సమాచారమిచ్చారు. ఇలా వరుస సంఘటనలు జరగడంతో భైంసా అల్లర్ల ప్రభావం చుట్టుపక్కల పాకిందా, భైంసా పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఇలాంటి సంఘటనలు పల్లెటూర్లకు పాకుతున్నాయా అన్నా అనుమానం ప్రజలలో వ్యక్తమవుతోంది.