Royal Enfield: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లో చీప్‌ అండ్ బెస్ట్ ఇది.. కానీ ఫీచర్స్‌ ఉంటాయ్ మావా.. అదిరిపోతాయ్ అనుకో!

by Vennela |   ( Updated:2025-03-10 15:06:37.0  )
Royal Enfield: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లో చీప్‌ అండ్ బెస్ట్ ఇది.. కానీ ఫీచర్స్‌ ఉంటాయ్ మావా.. అదిరిపోతాయ్ అనుకో!
X

దిశ, వెబ్ డెస్క్: Royal Enfield Hunter 350: యూత్ నచ్చే, మెచ్చే బైక్ రాయల్ ఎన్ఫీల్డ్(Royal Enfield). డుక్ డుక్ అంటూ వచ్చే ఆ సౌండ్ వింటుంటే ఆ మజానే వేరుంటుంది. అయితే రాయల్ ఎన్ ఫీల్డ్ (Royal Enfield)బైక్ కొనుగోలు చేయాలంటే కాస్త ఎక్కువే చెల్లించాల్సి ఉంటుంది.

కానీ రాయల్ ఎన్ ఫీల్డ్(Royal Enfield) కు చెందిన హంటర్ 350 తక్కువ ధరకు అందిస్తోంది. సాధారణంగా ఈ బైకులు ప్రారంభ ధర రూ. 1.70లక్షలు ఉంటుంది.

కానీ హంటర్350 (Royal Enfield Hunter 350)మాత్రమే తక్కువ ధరకు విక్రయిస్తోంది కంపెనీ.ఈ బైకు ధర, ఫీచర్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ 350(Royal Enfield Hunter 350) బైక్ కొనుగోలు చేయాలంటే ఇదే మంచి సమయం. ఎందుకంటే ఇది కొనేవాళ్లకు ఇప్పుడు కంపెనీ మంచి ఆప్షన్స్ అందిస్తోంది.

అంటే బేసిక్ మోడల్ హంటర్ 350(Royal Enfield Hunter 350) రెట్రో ఫ్యాక్టరీ ధర కేవలం రూ. 1,49,900 మాత్రమే. అదే మెట్రో డాంపర్ వేరియంట్ అయితే రూ. 1,69, 434 పలుకుతోంది. ఈ బైక్ 20.2బీహెచ్పీ పవర్, 27ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. అందువల్ల ప్రమాదాలకు ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది.

అంతేకాదు ఇందులో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఇక ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే ఇందులో ఏకంటా 13 లీటర్ల కెపాసిటీ ఉన్న ట్యాంక్ ఉంది.మెట్రో వేరియంట్ లో అలాయ్ వీల్స్ ను ఇచ్చారు. ఇందులో కూడా రెండు టైర్లకు డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్ కూడా ఉంటాయి. హంటర్ 350 రాయల్ ఎన్ ఫీల్డ్ జె ప్లాట్ ఫామ్ పై తయారు చేశారు. అందుకే రైడింగ్ ఎక్స్ పీరియన్స్(Riding Experience) చాలా బాగుంటుంది.

For more Automobile news : https://www.dishadaily.com/Automobile

Next Story

Most Viewed