- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆటోవాలా బతుకు ఆగమాగం
దిశ, వరంగల్ : కరోనా వైరస్ పేద, మధ్య తరగతి జీవితాలను చిన్నాభిన్నం చేస్తోన్నది. లాక్‌డౌన్ తో అన్నివర్గాల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంటికే పరిమితమవడంతో పనులు లేక, పైసలు దొరకక పస్తులుంటున్నారు. ఆటో డ్రైవర్ల జీవన చిత్రం పూర్తిగా మారిపోయింది. బతుకు భారమై పిల్లాపాపలతో అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్షకు పైగా ఆటోలు నడుస్తుంటాయి. ఒక్క గ్రేటర్ వరంగల్ నగరంలో 30 వేలకు పైగా ఆటోలు ఉన్నాయి. వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రై సిటీలో నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఆటోడ్రైవర్లపై లాక్ డౌన్ ప్రభావం తీవ్రంగా చూపుతోన్నది.
ఫైనాన్స్ వేధింపులు….
ఆటో డ్రైవర్లకు ఫైనాన్స్ కంపెనీల వేధింపులు ఎక్కువైనట్లు తెలుస్తోన్నది. లాక్‌డౌన్‌తో ఆటోలు నడవని కారణంగా వాయిదాలు చెల్లించలేకపోతున్నట్లు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 150 వరకు ఫైనాన్స్ సంస్థలున్నట్లు అంచనా. ఈ పరిస్థితుల్లో ఫైనాన్సర్లు వాయిదాలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక రోజువారీగా కిరాయికి ఆటోలు తీసుకుని నడిపే డ్రైవర్లకు ఉపాధి కరువవడంతో కుటుంబాన్ని పోషించుకోలేక, ఇంటి అద్దెలు చెల్లించలేక సతమతమవుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఆటోడ్రైవర్లు వేడుకుంటున్నారు.
ఫైనాన్స్ చెల్లించలేకపోతున్నాం:
ఎ.సంతోష్, జనగామ జిల్లా
నిత్యం ఆటో నడుపుతూ వచ్చే డబ్బులతో ఫైనాన్స్ కట్టుకుంటూ మిగిలిన వాటితో ఇంటి అవసరాలు వెళ్లదీస్తున్నాం. ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల ఉపాధి లేకుండాపోయింది. ఆటో ఫైనాన్స్ తోపాటు ఇంటి కిరాయిలు చెల్లించలేక పోతున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆటోలు నడుపుకునే విధంగా అనుమతి ఇవ్వాలి.
లాక్ డౌన్ వల్ల ఉపాధి పోయింది: అమర్, జనగామ
కొన్నేళ్లుగా ఆటో నడుపుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఆటోలు నడవక ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయి. పిల్లల చదువు నిమిత్తం చిట్టీలు కూడా కట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఆటో కార్మికులను గుర్తించి షరతులతో కూడిన అనుమతులివ్వాలి.
Tags:Warangal, auto Drivers, corona effect, home rentals, finance