- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మార్జిన్ పెంచితేనే లాభాలు : వాహన డీలర్లు
దిశ, సెంట్రల్ డెస్క్: కంపెనీ లాభాల్లోకి మారాలంటే మార్జిన్‌ను కనీసం 7 శాతం చేయాలని ఆటోమొబైల్ డీలర్లు అభ్యర్థిస్తున్నారు. వాహనం విక్రయించేందుకు డీలర్లు సదరు వాహన సంస్థ నుంచి మార్జిన్ అంటే లాభం తీసుకుంటాయి. కరోనా వైరస్‌కి తోడు గత రెండేండ్లుగా వాహన అమ్మకాలు తక్కువున్నందున, వ్యాపార పరిమాణం క్షీణించి, ఇబ్బందులు పడుతున్నట్టు వాహన డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు మందగమనం కారణమైతే, ఈ ఏడాది లాక్‌డౌన్ వల్ల ఉత్పత్తి లేకపోవడం, వాహనాల సేల్స్ క్షీణించాయని వారు చెబుతున్నారు. తమకు ఒక్కో వాహనంపై 7 శాతం ఇవ్వాలని, వ్యాపారాలు నిలదొక్కుకోవాలంటే డీలర్ల వ్యయం కనీసం 20 శాతం తక్కువుండేలా వాహన కంపెనీల డీలర్ల అసోసియేషన్‌ల సమాఖ్య(ఎఫ్ఏడీఏ) కోరుతోంది. అధిక ఖర్చులతో లాభదాయకత తగ్గిందని, తక్కువ నిర్వాహణతో మార్జిన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని డీలర్ల సమాఖ్య పేర్కొంది. ఈ క్రమంలో సత్వరమే సాయం అందించాలని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫాక్చరర్స్(ఎస్ఐఏఎమ్)కు డీలర్ల సమాఖ్య అధ్యక్షుడు ఆశిష్ హర్షరాజ్ లేఖ ద్వారా తెలియజేశారు. రుణాలపై చెల్లించే వడ్డీ, ఉద్యోగుల ఖర్చులు, అద్దె పెరగడం వంటి వాటితో పాటు వాహనాల విక్రయాలు తగ్గుతున్నాయి కానీ డీలర్ మార్జిన్ పెరగడం లేదని చెప్పారు. డీలర్లు 3.5 శాతం మార్జిన్లకే విక్రయిస్తున్నారని, దీనివల్ల టర్నోవర్ 0.5 శాతం నుంచి 1 శాతం నికర లాభాలకే వ్యాపారాలను నిర్వహించాల్సి వస్తోందని చెప్పారు.