- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇష్టారాజ్యంగా అక్రమ కట్టడాలు.. భారీగా చేతులు మారుతున్న ముడుపులు
దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. ఈ ప్రాంతంలో నివసించడానికి ఒకటి లేదా రెండు గదులకే పర్మిషన్ ఉందని అందరికీ తెలిసిన విషయమే. మరి బయ్యారంలో బహుళ అంతస్తుల నిర్మాణలకు ఏ అధికారి పర్మిషన్ ఇచ్చారన్నది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బయ్యారంలో బడాబాబులు తమ ఇష్టానుసారం అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అక్రమ కట్టడాలపై ఏ ఒక్క అధికారి కూడా స్పందించకపోవడం గమనార్హం.
బడాబాబులకు పినపాక మండలంలో ఓ నలుగురు విలేకరులు తమ పూర్తి మద్దతు తెలుపుతున్నారని మండలంలో టాక్ వినిపిస్తోంది. ప్రజా సమస్యలు, రాజకీయాలు, అవినీతి అక్రమాలపై ప్రజలకు సమాచారం అందించే విలేకరులు అక్రమ కట్టడాలపై ఎందుకు మాట్లాడటం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆ నలుగురు విలేకరులు ఐడీ కార్డు చూపిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.
‘దిశ’ పత్రిక అక్రమ కట్టడాలపై వార్త రాస్తే ఆ నలుగురు విలేకరులు మాట్లాడుతూ.. ఆ బహుళ అంతస్తుల కట్టడాలు మావే.. మా సన్నిహతులవే అంటూ.. నువ్వు కట్టడాల జోలికి వెళ్లకు అని అనడం గమనార్హం. నువ్వు ఏం చేయలేవు అంటూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే ఆ నలుగురు డబ్బులు బాగా సంపాదించారని లోకల్‌గా మాట్లాడుకుంటున్నారు. కొంత మంది అధికారులు, బడాబాబులు వారికి పూర్తి మద్దతు తెలపడంతోనే వారు ఇలా బయ్యారం క్రాస్ రోడ్డులో బహుళ అంతస్తులను నిర్మిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఆ నలుగురు చెప్పిన విధంగానే అధికారులు నడుచుకుంటున్నారని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులే ఇలా మౌనంగా ఉంటే ఏజెన్సీ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని ప్రజలు అనుకుంటున్నారు. ‘దిశ’ విలేకరి బయ్యారం పంచాయతీ సెక్రటరీ హరీష్‌ని బహుళ అంతస్తులపై వివరణ కోరగా బయ్యారంలో నిర్మిస్తున్న కట్టడాలకు పర్మిషన్ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ కట్టడాల యజమానులకు నోటీసులు పంపించామని తెలిపారు. అయిన వారు వినడం లేదని సెక్రటరీ వాపోయారు. అంటే దీని బట్టి బయ్యారం బడాబాబులు ఏవిధంగా రెచ్చిపోతున్నారో సెక్రటరీ మాటల ద్వారా తేటతెల్లమౌవుతోంది.
కలెక్టర్ సార్ ఏంటి ఈ దారుణం..
ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలపై కలెక్టర్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జిల్లా అధికారులు అమ్ముడుపోయారని జిల్లా డీఎల్‌పీ పవన్ ప్రవర్తన ద్వారా తెలిసిపోతున్నది. డీఎల్‌పీ పవన్ ఎక్కడ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అక్రమ కట్టడాల్లో జిల్లా అధికారులు అమ్ముడుపోయారని వారికి 10% వాటా ఉందని మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాలపై కలెక్టర్ ఏవిధంగా చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే.