- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేలకొరిగిన అరుదైన ఆఫ్రికన్ జాతి వృక్షం..
దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని అశోక్ నగర్ వద్ద ఓ చెట్టును రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అధికారులు కూల్చేశారు. ఇది ఆసియా ఖండంలొనే అతి అరుదైన వృక్షం అని, అంతేగాకుండా ఆఫ్రికన్ జాతి చెందిన బూరుగ వృక్షం అని స్థానిక అధికారులు తెలిపారు. అదన్ సోనియా డిజిటేటన్ లీన్(బూరుగ వృక్షము) రోడ్డు విస్తరణ పనుల్లో కూల్చేశారని తెలిపారు.
కాగా ఈ వృక్షం రోడ్డు విస్తరణ పనులకు అడ్డుగా లేదని పర్యావరణ వేత్తలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి అరుదుగా దొరికే వృక్షాలను ప్రభుత్వం చొరవ తీసుకొని సంరక్షించి వాటి ప్రాముఖ్యతను ప్రజలకు తెలిసేలా చర్యలు చేపట్టాలని అధికారిక ఉత్తర్వులు ఉన్నాయని, అయినా కలక్టర్, మున్సిపల్ అధికారులకు సంరక్షించాలి అని పర్యావరణ ప్రేమికులు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కనీసం పట్టించుకోవడం లేదని తెలిపారు.
ఇటువంటి వృక్ష జాతిని సందర్శనా ప్రదేశాలుగా మార్చి పర్యాటకులకు, విద్యార్థులకు వాటి ప్రాముఖ్యత తెలుపుతూ అందుబాటులో ఉంచేలా చూడాల్సిన ప్రభుత్వ అటవీ శాఖ యంత్రాంగం పట్టించుకోకపోతే భావితరాలు ఎలా విజ్ఞానం పొందుతారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.