అతడ్ని సెలెక్ట్ చేయాల్సి వస్తే తప్పుకుంటా.. ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Shyam |
Tim Paine
X

దిశ, స్పోర్ట్స్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ డిసెంబర్ 8 నుంచి ప్రారంభం కానున్నది. అయితే ఇటీవల అభ్యంతరకరమైన మెసేజెస్ పంపాడనే ఆరోపణలతో టిమ్ పైన్ కెప్టెన్సీని వదిలేసిన సంగతి తెలిసిందే. యాషెస్‌కు ఎంపిక చేసిన 15 మందిలో టిమ్ పైన్ ఒకడు. అంతే కాకుండా ఆ బృందంలో అతనొక్కడే వికెట్ కీపర్. దీంతోఅతడిని కచ్ఛితంగా ఎంపిక చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. అలా కాకుండా పైన్‌ను తుది జట్టులోకి తీసుకునే విషయంలో ఓటింగ్ పద్ధతి అమలు చేస్తే తాను అక్కడి నుంచి తప్పుకుంటానని చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ అన్నాడు. ‘యాషెస్ సిరీస్‌లో టిమ్ పైన్ ఆడటానికి తాను అనుమతించకపోతే ఓటింగ్ పద్ధతిని తీసుకొస్తారు. అదే జరిగితే తాను తప్పుకొని దాని బాధ్యతలను మరో సెలెక్టర్ టోనీ డోడ్‌మెయిడ్, హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్‌కు అప్పగిస్తాను. వాళ్లే తుది నిర్ణయం తీసుకుంటారు’ అని జార్జ్ బెయిలీ అన్నాడు. అయితే పైన్‌ను వ్యతిరేకిస్తూ జార్జ్ ఈ నిర్ణయం తీసుకోలేదు. టిమ్ పైన్‌కు జార్జ్ బెయిలీ అత్యంత సన్నిహితుడు. అంతే కాకుండా వారిద్దరూ వ్యాపార భాగస్వామయులు కూడా. అందుకే పైన్ విషయంలో దూరంగా ఉండాలని జార్జ్ భావిస్తున్నాడు.

Advertisement

Next Story

Most Viewed