కోవిడ్ వ్యాక్సిన్ పై ఆస్ట్రేలియా పీఎం ఆసక్తికర వ్యాఖ్యలు 

by vinod kumar |
కోవిడ్ వ్యాక్సిన్ పై ఆస్ట్రేలియా పీఎం ఆసక్తికర వ్యాఖ్యలు 
X

దిశ, వెబ్ డెస్క్: కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను ముందు ఎవరు కనుగొన్నా వారు ఇతర దేశాలతో తప్పక భాగస్వామ్యం కావాలని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మొర్రిసన్ కోరారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రపంచ దేశాలకు ఈ విధంగా విజ్ఞప్తి చేసారు. సరైన కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను (covid-19 vaccine) ముందుగా ఉత్పత్తి చేసే ఏ దేశమైనా దానిని ప్రపంచంతో పంచుకోవాల్సిన అవసరం ఉందని, లేనిచో వారు చరిత్రలో దోషులుగా మిగిలిపోయే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆస్ట్రేలియానే ముందు వ్యాక్సిన్‌ను కనుగొంటే… మేము దానిని అందరికీ అందివ్వడానికి సిద్ధంగా ఉన్నామని మోరిసన్ హామీ ఇచ్చారు. వ్యాక్సిన్లను డెవలప్ చేయడానికి, వాటిని తయారు చేసి సరఫరా చేయగలిగే స్థితిలోను ఆస్ట్రేలియా ఉందని స్పష్టం చేసారు ఆ దేశ ప్రధాని స్కాట్ మొర్రిసన్.

Advertisement

Next Story

Most Viewed