మహారాష్ట్రలో పోలీసులపై దాడి

by Sumithra |
మహారాష్ట్రలో పోలీసులపై దాడి
X

ముంబై: లాక్‌డౌన్ వేళ ఓ ప్రార్థనామందిరం వద్ద గుమిగూడిన జనాలను చెదరగొట్టేందుకు యత్నించిన పోలీసులపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా పైతాన్ తాలూకాలో సోమవారం చోటుచేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ.. ప్రార్థనామందిరం వద్ద సుమారు 40మంది వరకూ గుమిగూడారు. ఈ క్రమంలో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు యత్నించగా, దుండగులు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. దాడిచేసిన వారిలో మహిళలూ ఉండటం గమనార్హం. ఈ దాడిలో ఓ అధికారితో పాటు ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. సమాచారమందుకున్న అధికారులు ఘటనా స్థలానికి అదనపు బలగాలను పంపగా, గుమిగూడిన జనాలను చెదరగొట్టి, 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో 12మంది నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు వెల్లడించారు. కాగా, గాయపడిన పోలీసులు ప్రస్తుతం పైతాన్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు.

Tags: cops attacked by mob, maharastra, aurangabad, prayer, lockdown, corona, paithan,

Advertisement

Next Story

Most Viewed