- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఫ్లాష్ ఫ్లాష్ : ఏపీలో పాఠశాలల ఓపెనింగ్ అప్పుడే..

X
దిశ, ఏపీబ్యూరో : రాష్ట్రంలో ఆగష్టు 16న పాఠశాలలు తెరుస్తామని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ప్రభుత్వ టీచర్లకు వ్యాక్సిన్ వేసిన తర్వాతే పాఠశాలలు తెరవాలని దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆగస్టు 16 నుంచి పాఠశాలలు తెరుస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇప్పటికే ప్రభుత్వ టీచర్లలో 60% మందికి వ్యాక్సిన్ వేశామని కోర్టుకు వివరించింది. మిగతా వారికి కూడా వ్యాక్సిన్ వేసేలా చర్యలు చేపట్టినట్లు వివరించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 11కు కోర్టు వాయిదా వేసింది.
Next Story