‘కరోనా నుంచి బయటపడ్డాం’

by Shyam |   ( Updated:2020-09-13 06:25:51.0  )
‘కరోనా నుంచి బయటపడ్డాం’
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా ప్రభావం నుంచి బయటపడి వ్యాపారం తిరిగి పుంజుకుంటున్నట్టు లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా (Audi India) వెల్లడించింది. భారత్‌లో పండుగ సీజన్ కారణంగా డిమాండ్ భారీగా పెరుగుతోందని, ఈ డిమాండ్‌ను సద్వినియోగం చేసుకుంటూ కొత్త ఉత్పత్తులతో గరిష్ఠ స్థాయికి చేరుకుంటామని ఆడి ఇండియా కంపెనీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కరోనాకు ముందు స్థాయికి చేరుకోనప్పటికీ, సంస్థ తన షోరూమ్‌లలో పెరిగిన పురోగతి దీన్ని బలపరుస్తోందని, అయితే..ఆన్‌లైన్ కస్టమర్లు ఇటీవల పెరిగారని కంపెనీ పేర్కొంది.

వ్యాపార పరంగా కరోనా సంక్షోభం నుంచి బయటపడ్డాం. కరోనా వ్యాప్తి ఇంకా పెరుగుతోంది. అయినప్పటికీ వ్యాపారం తిరిగి పుంజుకుంటోంది. తాము వినియోగదారుల బలం తిరిగి దక్కించుకుంటున్నామని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ థిల్లాన్ వెల్లడించారు. కార్యకలాపాల గురించి ప్రస్తావించిన ఆయన, సంస్థకు ముఖ్యంగా నెట్‌వర్క్ ప్రధానం.

ప్రస్తుతం నెట్‌వర్క్ పూర్తిగా కోలుకుంది. దేశవ్యాప్తంగా అన్ని డీలర్‌షిప్‌లు పనిచేస్తున్నాయన్నారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో సిబ్బంది కరోనా ప్రభావానికి గురవుతున్నారు. కాబట్టి సంస్థ అమ్మకాల వృద్ధి (Sales growth)కి మరికొంత సమయం పడుతుందని బల్బీర్ సింగ్ తెలిపారు. పండుగ సీజన్ మొదలవుతున్న కారణంగా ఖచ్చితంగా సాధారణ స్థాయికి చేరుకుంటామనే విశ్వాసం ఉందని, వినియోగదారులు షోరూమ్‌లకు వస్తున్న పురోగతిని గమనిస్తున్నామని ఆయన తెలిపారు.

Advertisement

Next Story