- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
న్యాయవాదిపై గుర్తు తెలియని దుండగుల హత్యాయత్నం..
దిశ, ఖైరతాబాద్ : న్యాయవాది కళ్యాణ్ పై మంగళవారం ఉదయం గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నం చేశారు. హిందూ కార్యక్రమాలలో యాక్టివ్ గా ఉన్న కళ్యాణ్ ని టార్గెట్ గా చేసుకొని కత్తులతో దాడికి దిగారు. మంగళవారం ఉదయం ఖైరతాబాద్ స (ఐమాక్స్ ) ప్రసాద్ థియేటర్ సమీపంలో ఒంటరిగా వెళుతున్న అడ్వకేట్ కళ్యాణ్ ను చంపేందుకు గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడికి తెగబడ్డారు. అటుగా వెళుతున్న కళ్యాణ్ కు రాంగ్ రూట్లో ఎదురుగా వెళ్లి దాడికి పాల్పడ్డారు. తప్పించుకునే క్రమంలో చేతులు అడ్డు పెట్టడంతో ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడ్డాడు.
అయితే దీనిని సెల్ ఫోన్ దొంగల ముఠాగా చిత్రీకరించేందుకు పోలీసులు వక్రీకరించడం భావ్యం కాదని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ రామ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. హిందూ నాయకులను టార్గెట్ గా చేసుకుని హత్యాయత్నం కొనసాగించడం అత్యంత అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదిగా సమాజ సేవలో పాల్గొంటున్న కళ్యాణ్ పై దాడికి దిగడం దిగ్భ్రాంతి కలిగిస్తుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాలపై పథకం ప్రకారం దాడులు జరుగుతున్నాయని.. దాడులకు పాల్పడిన వారందరూ పిచ్చి వాళ్లని సర్టిఫికెట్ ఇవ్వడంలో సఫలీకృతం అవుతున్న ప్రభుత్వం.. ఈ దాడిని కూడా దొంగల ముఠాగా చిత్రీకరించడం తగదని హెచ్చరించారు. సెల్ ఫోన్ దొంగలకు కత్తులతో వెంబడించి కసిగా పొడవడం లో ఉన్న ఆంతర్యం ఏమిటని పోలీసులను డాక్టర్ రామ్ సింగ్ ప్రశ్నించారు. ఇంతటి మహానగరంలో పట్టపగలు, నడిరోడ్డుపై కత్తులతో దాడికి చేసి పారిపోయినప్పటికీ పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం వ్యవహరించడం ఏమాత్రం తగదు అన్నారు.
కాంగ్రెస్ పాలనలో హిందువులకు రక్షణ కరువైందని, పట్టపగలే హత్యలు జరుగుతున్న కూడా పట్టించుకోవడంలేదని తీవ్ర విమర్శలు చేశారు. న్యాయవాద వృత్తిలో రాణిస్తున్న కళ్యాణ్ పై ప్రభుత్వమే ఈ దాడి చేయించినదని, దీని వెనుక ఉన్న జిహాదీ మాఫియాను బయటపెట్టాలని విశ్వహిందూ పరిషత్ నేత డిమాండ్ చేశారు. దాడికి పాల్పడ్డ దుండగులను ఎన్ కౌంటర్ చేయాలని, బాధితుడికి ప్రభుత్వం రక్షణ కల్పించి ప్రాణాన్ని కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తీవ్ర ఆందోళనలకు సిద్ధమవుతామని విశ్వహిందూ పరిషత్ నేతలు హెచ్చరిస్తూ ప్రకటన విడుదల చేశారు.