- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మహిళలపై దాడులు పెరుగుతూనే ఉన్నాయి : వైఎస్ షర్మిల
దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్ పాలనలో రోజురోజుకూ మహిళలపై దాడులు పెరుగుతూనే ఉన్నాయని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల ఆదివారం ట్వీట్టర్ వేదికగా విమర్శించారు. అర్ధరాత్రి ఆడవారు ఒంటరిగా నడిచినప్పుడే అసలైన స్వాతంత్ర్యం వచ్చినట్లని గాంధీజీ చెప్పారని, అయితే రాష్ట్రంలో కనీసం పట్టపగలు కూడా మహిళల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందన్నారు. తెలంగాణలో ఇంకా మహిళలకు స్వాతంత్ర్యం రాలేదని గాంధీజీ ఆత్మ క్షోభిస్తోందని ఆమె విమర్శలు చేశారు. పట్టపగలే జైలు గోడల మధ్య మహిళల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారన్నారు. చంటి పిల్లల తల్లులను జైల్లో పెట్టిస్తున్నారని షర్మిల ట్వీట్ చేశారు. 75 ఏండ్ల స్వతంత్ర్య దేశంలో ఏడేండ్ల స్వరాష్ట్రంలో మహిళల రక్షణ కోసం మరో పోరాటాన్ని చేపడుదామని ఆమె ట్వీట్ చేశారు.
లోటస్ పాండ్‌లో పంద్రాగస్టు వేడుకలు
వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తూడి దేవేందర్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. దేశ ప్రజలు స్వేచ్ఛగా జీవితాన్ని కొనసాగిస్తున్నారంటే దానికి స్వతంత్ర్య సమరయోధుల త్యాగాలే కారణమని ఆయన అన్నారు. స్వాతంత్ర్య సమరంలో అమర వీరులత్యాగాలను ఈ సందర్భంగా నేతలు గుర్తు చేసుకున్నారు. ఈ వేడుకల్లో వైఎస్సార్ టీపీ అధికార ప్రతినిధులు వాడుక రాజగోపాల్, పిట్ట రాంరెడ్డి, మహమ్మద్ ముస్తాబా, భూమిరెడ్డి, వైఎస్సార్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నేతలు అభిమానులు పాల్గొన్నారు.