- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బెల్టు షాపులపై దాడులు.. పెద్ద మొత్తంలో మద్యం స్వాధీనం
దిశ, చేవెళ్ల: బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వం ఓ వైపు మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశించగా.. గ్రామాలలో మాత్రం బెల్టు దుకాణాలు నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ సంఘటన శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏడు గ్రామాలలో చోటు చేసుకుంది. సైబరాబాద్ కమీషనర్ ఆదేశానుసారం శంకర్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్ నేతృత్వంలో ఎస్సైలు లక్ష్మీనారాయణ, సంజీవ కుమార్, పోలీస్ సిబ్బంది సోమవారం ఏడు గ్రామాలలోని 11 దుకాణాలపై దాడులు నిర్వహించారు.
పెద్ద మొత్తంలో మద్యం స్వాధీనం చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా బెల్టు దుకాణాలు కొనసాగిస్తున్న యజమానులపై కేసులు నమోదు చేశారు. మోకిల తండాలో రెండు దుకాణాలు, కొండకల్ లో 4 దుకాణాలు, మహారాజ్పేట్ లో ఒకటి , బుల్కాపూర్ లో ఒకటి, సింగపూర్ టవర్లో ఒకటి, చందిప్పలో ఒకటి, శంకర్ పల్లిలో ఒక దుకాణంపై దాడి చేసి మద్యం స్వాధీనం చేసుకున్నారు. మద్యం అమ్ముతున్న వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు శంకర్పల్లి ఎస్సై లక్ష్మీనారాయణ తెలిపారు.