7 నిమిషాల్లో ఏటీఎంను కొల్లగొట్టడం వారి ప్రత్యేకత

by Shyam |   ( Updated:2020-10-23 07:31:51.0  )
7 నిమిషాల్లో ఏటీఎంను కొల్లగొట్టడం వారి ప్రత్యేకత
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ :
అంతరాష్ట్ర దొంగల ముఠాను మహబూబ్ నగర్ జిల్లా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. విమానాలలో విహరిస్తూ, కార్లలో దర్జాగా దేశం మొత్తం తిరుగుతూ నిమిషాల వ్యవధిలో ఏటీఎంలను కొల్లగొట్టడం వీరి ప్రత్యేకతని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ రమారాజేశ్వరి తెలిపారు. మీడియా సమావేశంలో శుక్రవారం ఆమె మాట్లాడుతూ…హర్యానా రాష్ట్రానికి చెందిన ఏడు మంది ముఠాగా ఏర్పడి దేశవ్యాప్తంగా దొంగతనాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ముఠాలోని సభ్యులు వ్యక్తిగతంగా, ఉమ్మడిగా కలిసి దేశవ్యాప్తంగా సుమారు యాభై ఏడు భారీ దొంగతనాలు, మోసాలకు పాల్పడ్డారని తెలిపారు. గత నెల 29న జడ్చర్ల పట్టణంలోని సిగ్నల్ గడ్డ ప్రాంతంలో ఉన్నఎస్‌బీ‌ఐ ఏటీఎంలో గ్యాస్ కట్టర్, ఇతర పరికరాలను ఉపయోగించి కేవలం ఏడు నిమిషాల వ్యవధిలోనే నలభై ఒక్క లక్షల రూపాయలను ఈ ముఠా దోపిడీ చేశారని వివరించారు. ఈ ఘటన జరిగిన నిమిషాల్లోనే జడ్చర్ల పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు. ఆ తర్వాత నిందితులు ఉన్న డెన్ పైనే దాడి చేసి ఆరుగురు నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. కాగా అరెస్ట్ చేసిన నిందితుల వద్ద నుండి పన్నెండు లక్షల నగదు, దొంగతనానికి వినియోగించిన కారు, గ్యాస్ కట్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed