- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఏటీఎం చోరీల దొంగలు అరెస్ట్..!
by Sumithra |

X
దిశ, పటాన్‌చెరు: ఏటీఎంలను టార్గెట్ చేసుకుని, గ్యాస్ కట్టర్ల సహాయంతో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని పటాన్‌చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామచంద్రాపురం పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ అబ్దుల్ ఖలీల్, వందనపురి కాలనీకి చెందిన ఎరుకల మహేష్‌లు ఐదు ఏటీఎంల్లో దొంగతనాలకు యత్నించారు. రుద్రారంలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో శనివారం తెల్లవారుజామున చోరీకి యత్నిస్తుండగా ఎస్ఐ రామానాయుడు నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల నుంచి ఒక బైక్, గ్యాస్ సిలిండర్లు, కట్టర్‌తో పాటు పనిముట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.
Next Story