- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మైదుకూరులో ఏటీఎం సెంటర్ సీజ్
by srinivas |
కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న ఓ యువకుడు ఏటీఎం డిస్‌ఫ్లే బోర్డుపై ఉమ్మేశాడు. ఈ ఘటన కడప జిల్లా మైదుకూరు పట్టణంలోని రాయల్ సర్కిల్‌లో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌లో చోటు చేసుకుంది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతన్ని అరెస్ట్ చేశారు. కేసు కూడా నమోదైంది. ఈ ఘటనతో ఏటీఎం సెంటర్‌ను మూసివేయాలని బ్యాంకు అధికారులకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. సదరు యువకుడికి వైద్య పరీక్షలు నిర్వహించగా, తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబు ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కాగా, కడప జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 23 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Tags: Caronavirus, Suspected Man, ATM, Ap News
Next Story