విజయ్ కు రుణపడి ఉంటా… అట్లీ ఎమోషనల్ ట్వీట్

by Shyam |
విజయ్ కు రుణపడి ఉంటా… అట్లీ ఎమోషనల్ ట్వీట్
X

కోలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ. ఆయన దర్శకత్వంలో వచ్చిన “పోలీసోడు ( థేరి)” సినిమా విడుదలై నాలుగేళ్లు అయిన సందర్భంగా హీరో విజయ్ కు థాంక్స్ చెప్తూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు అట్లీ. ” థేరి ” నా ఫేవరెట్ సినిమా అని.. నా హృదయానికి చాలా దగ్గరైన చిత్రం అని తెలిపారు. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం విజయ్ కే చెందుతుందన్నారు. విజయ్ అన్న నాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉన్నాడని… విజయ్ తనపై చూపించే ప్రేమకు థాంక్స్ చెప్పాడు. ఈ సినిమా నిర్మాణ సంస్థ “ద వి క్రియేషన్స్” కు కృతజ్ఞతలు తెలిపారు.

అట్లీ వైఫ్ ప్రియా మోహన్ కూడా విజయ్ కు థాంక్స్ చెప్పారు. మా ఫ్యామిలీకి ఎల్లప్పుడూ సపోర్ట్ చేసే బిగ్ బ్రదర్ విజయ్ కు ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అన్ని వేళలా మాతోనే ఉన్నారని… భవిష్యత్తులోనూ విజయ్ సపోర్ట్ మాకు ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. “థేరి” టీం మొత్తానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు ప్రియా మోహన్.

కాగా అట్లీ బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ డైరెక్ట్ చేయబోతున్నారు. టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కూడా సినిమా చేయబోతున్నారు అని టాక్.


Tags: Atlee, priya Mohan, Vijay, Theri

Advertisement

Next Story

Most Viewed