- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అటల్’ టన్నెల్‌కు ప్రపంచరికార్డు..
దిశ, వెబ్‌డెస్క్: హిమాచల్ ప్రదేశ్ ఈ పేరు వింటేనే పర్వత సానువులు, ఎత్తైన కొండలు, చుట్టూ మంచుతో కప్పబడిన సుందర ప్రదేశాలు కనిపిస్తాయి. ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే ఇక్కడ సాధారణ వాతావరణం ఉంటుంది. మిగతా ఆరునెలలు ఎప్పుడూ మంచు కురుస్తూనే ఉంటుంది. అలాంటి కొండ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు, ఇతర ప్రదేశాలను చేరుకోవడానికి సరైన రోడ్డు మార్గం కూడా లేదు. దీంతో వేరే ప్రాంతాలకు వెళ్లాలంటే అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు.
అది గుర్తించిన భారత ప్రభుత్వం ‘హిమాచల్ ప్రదేశ్‌లోని రోహ్‌తక్ నుంచి లద్దాక్‌లోని లేహ్’ వరకు సొరంగ మార్గం నిర్మించాలని 2000 సంవత్సరం జూన్ 3న నాటి ప్రధాని అటల్ బిహరీ వాజ్‌పేయ్ నిర్ణయించారు. 2002 మే 26న సౌత్ పోర్టల్ వద్ద పునాదిరాయి వేయగా.. 2010 జూన్ 28న నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో సోనియా గాంధీ టన్నెల్ పనులకు శంకుస్థాపన చేశారు. మొదట ఆరేండ్లలో దీని నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నా వాతావరణ పరిస్థితులు, ఇతర కారణాల వలన అది పూర్తవడానికి పదేండ్లు పట్టింది.
ప్రపంచ రికార్డు..
ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగ మార్గం నిర్మించిన దేశంగా ఇండియా చరిత్ర సృష్టించింది. ఈ టన్నెల్ సముద్ర మట్టానికి 3 వేల మీటర్లు (10వేల అడుగుల ఎత్తు)లో నిర్మాణం జరుపుకుంది. ఆధునిక సాంకేతికతో నిర్మితమైన ఈ టన్నెల్ వలన హిమాచల్ ప్రదేశ్, లేహ్ వాసుల దశాబ్ధాల కల సాకారం కానుంది. ఈ సొరంగ మార్గం పొడవు 9.02 కిలోమీటర్లు కాగా, ఇది అందుబాటులోకి రానుండటంతో ‘మనాలీ నుంచి లేహ్’ మధ్య 46 కిలోమీటర్ల దూరం తగ్గనుంది.
రోహ్‌తక్ పేరు మార్పు..
మనాలిలోని రోహ్‌తక్ పాస్ వద్ద నిర్మించిన అతిపెద్ద సొరంగ మార్గాన్ని మొదట రోహ్‌తక్ టన్నెల్‌గా పిలిచేవారు. అయితే, భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయ్ మరణాంతరం ఆయన గుర్తుగా ఈ సొరంగ మార్గానికి ‘అటల్ టన్నెల్’గా మోడీ ప్రభుత్వం నామకరణం చేసింది. ఈ టన్నెల్ నిర్మాణానికి నాటి ప్రధాని వాజ్‌పేయ్ ఎంతో కృషి చేశారని అందువల్లే దీనికి ఆయన పేరు పెట్టినట్లు 2019 డిసెంబరు 24న బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది.
అటల్ టన్నెల్ విశేషాలు..
హిమాచల్‌లోని మనాలి నుంచి లద్దాఖ్‌లోని లేహ్‌ను కలిపే ఈ టన్నెల్ పొడవు 9.02 కి.మీ కాగా, ప్రపంచంలోనే ఇంత పొడవైన సొరంగ రోడ్డుమార్గం మరెక్కడా లేదు. పిర్‌పంజాల్ పర్వశ్రేణుల్లో అత్యాధునిక టెక్నాలజీ, సదుపాయాలతో సముద్ర మట్టానికి 3వేల మీటర్లు (10వేల అడుగుల)ఎత్తులో ఉంది. మనాలి, లేహ్ మధ్య దూరం 46 కి.మీ తగ్గుతుండగా, 4 నుంచి 5 గంటల వరకు ప్రయాణం సమయం ఆదా అవుతుంది. గుర్రపు నాడా ఆకారంలో ఉండే సింగ్ ట్యూబ్ డబుల్ హైవే టన్నెల్ వెడల్పు 8 మీ. ఉండగా, ఓవర్ హెడ్ క్లియరెన్స్ 5.525 మీ. వరకు ఉంటుంది. ఈ మార్గం గుండూ ప్రతిరోజూ 3వేల కార్లు, 1500 ట్రక్కులు గంటకు 80 కి.మీ. వేగంతో ప్రయాణించవచ్చు.
రక్షణ సదుపాయాలు..
అటల్ టన్నెల్‌లో సెమీ ట్రాన్స్‌వర్స్ వెంటిలేషన్ సిస్టమ్, SCADA కంట్రోల్డ్ ఫైర్ సిస్టమ్, ఇల్యుమినేషన్, మానిటరింగ్ సిస్టమ్‌తో కూడిన ఎలక్ట్రో మెకానికల్ సౌకర్యం ఉంది. లోపల ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వాటి నివారణకు ప్రతి 60 మీటర్లకు ఒక ఫైర్ హైడ్రాంట్‌ను అమర్చారు. ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ కోసం ప్రతి 150మీ. ఒక టెలిఫోన్ అందుబాటులో ఉండటమే కాకుండా, ప్రతి 250 మీటర్లకు సీసీ కెమెరాలతో కూడిన ఆటో ఇన్సిడెంట్ డిటెక్షన్ సిస్టమ్‌ను అమర్చారు. ప్రతి కిలోమీటర్‌కు ఎయిర్ క్వాలిటీ (గాలి నాణ్యత) మానిటరింగ్ సిస్టమ్‌తో పాటు, ప్రతి 25 మీటర్లకు అత్యవసర ఎగ్జిట్ సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు.
మరో రెండ్రోజుల్లో అందుబాటులోకి..
ప్రస్తుతం అటల్ టన్నెల్ నిర్మాణం పూర్తయింది. దీనిని 03అక్టోబరు 2020న ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. రోహ్‌తంగ్ వద్ద ఉదయం 10గంటలకు టన్నెల్ ద్వారా వెళ్లే బస్సును జెండా ఊపి ఆయన ప్రారంభించనున్నారు. ఇదిలాఉండగా, ఈ టన్నెల్ అందుబాటులోకి వస్తే అత్యవసర సమయాల్లో శత్రువుల కంట పడకుండా యుద్దసామగ్రిని తరలించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని రక్షణ వర్గాలు తెలిపాయి.