- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్య భర్తల కోసం అదిరే స్కీం.. నెలకు రూ. 10 వేలు మీ సొంతం
దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చింది. అందులో ఒకటి అటల్ పెన్షన్ యోజనా పథకం. అసంఘటిత కార్మికులే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో గనుక చేరినట్టైతే మీకు అనేక లాభాలు ఉన్నాయి. ఒక వేళ మీరు పదవి విరమణ అయ్యేనాటికి డబ్బులు దాచుకోవాలి అనుకుంటే వెంటనే ఈ పథకంలో చేరివచ్చు. ఈ స్కీమ్‌లో కనుక పెట్టుబడి పెడితే ప్రతి నెల పెన్షన్ పొందవచ్చు. ఇంటిలో ఒక్కరికే కాదు భార్య భర్తలు ఇద్దరు ఈ పథకంలోచేరి ఏకంగా నెలకు పదివేలు సంపాదించవచ్చు. మరీ ఇంకెందుకు ఆలస్యం ఈ పెన్షన్ పొందాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలో చూద్దామా..
అర్హతలు..
- 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య వయసులో వాళ్లు అర్హులు.
- అటల్ పెన్షన్ యోజన పోస్ట్ ఆఫీస్ ఖాతా తప్పనిసరి, ఈ ఖాతా ఉన్నవారు ఎవరైనా ఈ పథకంలో చేరవచ్చును.
- సబ్‌స్క్రైబర్లు గరిష్టంగా 40 ఏళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
- కనీసం ఇరవై ఏళ్లు ఈ పథకం ఉపయోగించవచ్చు.
- లబ్ధిదారునికి 60 ఏళ్లు దాటిన తర్వాతనే పథకం డబ్బులు తీసుకోవడాని అర్హులు.
ఈ పథకంలో చేరిన వారికి నెల వారీగా వెయ్యి రూపాయిల నుంచి రూ.5000ల వరకు పెన్షన్ వస్తుంది. ప్రతి నెలా 42 రూపాయల నుండి 210 రూపాయల వరకు కాంట్రిబ్యూషన్ చేయవచ్చు. ఉదాహరణకు 18 ఏళ్ల వయసులో స్కీమ్‌లో రూ.5 వేల పెన్షన్ కోసం నెలకు రూ.210 చెల్లించాల్సి ఉంటుంది. రూ.1000కు అయితే రూ.42.. రూ.2 వేలకు రూ.84.. రూ.3 వేలకు రూ.126.. రూ.4 వేలకు రూ.168 కట్టాలి.
20 ఏళ్ల వయసులో భార్యభర్తలిద్దరూ ఇందులో చేరితే నెలకు రూ.500 చెల్లించడం ద్వారా ప్రతి నెలా రూ.10 వేల పెన్షన్ పొందొచ్చు. భార్యకు రూ.5 వేలు, భర్తకు రూ.5 వేలు. దీనికి భార్య రూ.248, భర్త రూ.248 కట్టాలి. వయసు పెరిగే కొద్దీ ప్రీమియం కూడా పెరుగుతుంది. అయితే దీనిలో ఇన్వెస్ట్ చేసిన 60 సంవత్సరాలకి పెన్షన్ వస్తుంది. అయితే అందరికి ఒక డౌంట్ ఉంటుంది ఇన్ని రోజులు ఈ పథకంలో డబ్బుల కట్టి తర్వాత అనుకోకుండా ఏమైనా జరిగి చనిపోతే ఎలా అని. కానీ, ఒకవేళ కనుక ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మరణిస్తే అతని భార్యకు చనిపోయే వరకు కూడా పెన్షన్ వస్తుంది. ఒకవేళ కనుక ఇద్దరూ మృతి చెందితే కార్పస్ మొత్తం నామిని అకౌంట్లోకి వేయడం జరుగుతుంది. ప్రీమియంని మాత్రం ప్రతి నెలా కనీసం మూడు నెలలకు ఒకసారి కానీ ఆరు నెలలకు గాని చెల్లించాలి.