- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వింత ఆచారం: రాముడి దీవెన.. శివ లింగానికి పీతల నివేదన
దిశ, ఫీచర్స్: సాధారణంగా దేవునికి పూలు, పండ్లు, పాలు, రకరకాల ఫలహారాలు నివేదిస్తుంటారు. కొన్ని ప్రదేశాల్లో మాంసాహార పదార్థాలను కూడా సమర్పిస్తుంటారు. కానీ సూరత్‌లోని ‘రామ్‌నాథ్ విశ ఘేలా’ ఆలయంలో మాత్రం పీతల్ని సమర్పించే భక్తులున్నారు.
సూరత్‌లోని ఉమ్రా గ్రామంలోని రామ్‌నాథ్ శివ ఘేలా దేవాలయాన్ని స్వయంగా రాముడే నిర్మించాడని ఇక్కడి భక్తుల విశ్వాసం. ఒకరోజు రాముడు సముద్రాన్ని దాటుతున్నప్పుడు, తన పాదాలకు తగిలిన పీతను చూసి చాలా సంతోషించాడని, అప్పుడు ఆ పీతను చేతుల్లోకి తీసుకుని దాన్ని ఆశీర్వదించాడని ఉమ్రా ప్రజలు చెబుతారు. ఆనాటి నుంచి పూజలో పీతలు ఒక ముఖ్యమైన భాగంగా మారిపోగా, అనాదిగా అదో సంప్రదాయంగా వస్తోంది. దాంతో భక్తులు ఆలయంలో ప్రార్థన చేసి, పీతలు సమర్పిస్తే స్వయంగా రాముడే తమను దీవించినట్లుగా భావిస్తారు. కోరుకున్న కోరికలు నెరవేరడంతో పాటు, అదృష్టం కలిసి వస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అంతేకాదు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారని కూడా నమ్ముతారు. దాంతో ప్రతి ఏటా మకర సంక్రాంతి రోజున శివ లింగానికి పీతలు సమర్పించడం ప్రసిద్ధ సంప్రదాయంగా మారింది.
పీతలను ఏం చేస్తారంటే..?
భక్తులు నివేదించిన పీతలను ఆలయ పూజారులు సేకరించి.. సమీపంలోని సముద్రంలో విడిచిపెడతారు.