- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘స్పుత్నిక్ వీ’తో కలిపి ఆస్ట్రా జెనెకా టీకా టెస్టు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని నిలువరించే టీకా అభివృద్ధిలో తొలిసారిగా రెండు దేశాల కంపెనీలు కలిసి ముందుకు రావడానికి సిద్ధమయ్యాయి. సమర్థవంతమైన టీకాను తీసుకురావడానికి రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ టీకా కంపోనెంట్‌ను కలిపి సొంత వ్యాక్సిన్‌పై ప్రయోగాలు చేయనున్నట్టు బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రా జెనెకా ప్రకటించింది. ఈ ఏడాది చివరిలో ఈ టెస్టు ప్రారంభించనుంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనెకాలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న టీకా కోసం ప్రపంచదేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
ఆస్ట్రా జెనెకా టీకా క్లినికల్ ట్రయల్స్‌లో సమర్థవంతమైన ఫలితాలు రాబట్టడానికి తమ (స్పుత్నిక్ వీ)టీకాకు చెందిన రెండింటిలో ఒక కంపోనెంట్‌ను వినియోగించుకోవడానికి రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(ఆర్‌డీఐఎఫ్) ఆఫర్ చేసింది. ఈ ఆఫర్‌ను ఆస్ట్రా జెనెకా స్వీకరించింది. తమ టీకాను స్పుత్నిక్ వీ కాంబినేషన్‌తో ఈ ఏడాది చివరిలో ట్రయల్స్ నిర్వహించడానికి సిద్ధమైంది. వీటి కాంబినేషన్ వైరస్‌ను నిలువరించే సామర్థ్యాన్ని పెంచుతుందా? అనే విషయన్ని ఆస్ట్రా జెనెకా శాస్త్రజ్ఞులు పరిశీలించనున్నారు. ఒక వ్యాక్సిన్ సామర్థ్యాన్ని పెంచడానికి మరో వ్యాక్సిన్, వైరల్ వెక్టార్‌ను ఉపయోగించుకుంటే హానీ జరుగుతుందేమోనని భయపడాల్సిన అవసరం లేదని టీకా నిపుణుడు విపిణ్ వశిష్ట తెలిపారు.