- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైఎస్సార్సీపీకి అజ్ఞాత విరాళాల వెల్లువ
దిశ, ఏపీ బ్యూరో: అధికార వైఎస్సార్సీపీకి అజ్ఞాత మార్గంలో భారీగా విరాళాలు అందాయి. తెలియని మార్గంలో అత్యధిక విరాళాలందుకున్న ప్రాంతీయ పార్టీల్లో ఒడిశాలోని బిజూ జనతా దళ్ (బీజేడీ) తొలిస్థానంలో నిలవగా, వైసీపీ రెండో స్థానంలో నిలిచినట్టు ‘అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్’ (ఏడీఆర్) తన నివేదికలో వెల్లడించింది. దేశంలోని 23 ప్రాంతీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి 2018-19లో అందిన విరాళాల వివరాలను సమర్పించాయి. వీటి ఆధారంగా ఏడీఆర్ ఓ నివేదిక రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం.. 2018-19 సంవత్సరంలో దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలకు రూ. 885 కోట్లకు పైగా విరాళాలు రాగా, ఇందులో సగానికిపైగా (రూ.481 కోట్లు) అజ్ఞాత మార్గం నుంచే వచ్చినట్టు పేర్కొంది. ఇలా తెలియని మార్గాల నుంచి రూ.213 కోట్లకు పైగా విరాళాలందుకుని బీజేడీ తొలి స్థానంలో నిలవగా, రూ.100కోట్లకు పైగా డోనేషన్లందుకుని వైసీపీ రెండో స్థానంలో నిలిచింది. రూ.37.78 కోట్ల అజ్ఞాత విరాళాలతో టీడీపీ ఐదో ప్లేస్‌లో ఉంది.