- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మీ ఆడబిడ్డగా అడుగుతున్నా.. ఆశీర్వదించండి
దిశ, భువనగిరి: త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ.. నేడు పెత్తందార్లు, దొరల చేతిలో బంది అయిందని నల్లగొండ-వరంగల్-ఖమ్మం జిల్లా పట్టభద్రుల యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంఎల్‌సీ అభ్యర్థిని రాణి రుద్రమ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు యాదాద్రి-భువనగిరి జిల్లా కేంద్రంలో యువతెలంగాణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సుమంగళి ఫంక్షన్ హాల్‌లో పట్టభద్రులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. యువతెలంగాణ అధినేత జిట్టా బాలక్రిష్ణా రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌కు చేదోడు వాదోడుగా తిరిగి ఆస్తులను పోగొట్టుకున్నారని అన్నారు.
ఆయనకు ఎన్నికల సమయంలో టికెట్ ఇవ్వకుండా పక్కకు పెట్టినా ప్రజల కోసం.. మూసి ప్రక్షాళనకు, ఉద్యోగుల సమస్యలు, బీబీనగర్‌లో నిమ్స్ సాధనకు పోరాడిన ఏకైక పార్టీ యువతెలంగాణ అన్నారు. తెలంగాణ సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు ప్రాణాలనే ఫణంగా పెట్టి స్వరాష్ట్రం సాధిస్తే.. నేడు కేసీఆర్ కుటుంబం, ఆయన అడుగులకు మడుగులోత్తే వాళ్ళు రాజభోగాలు అనుభవిస్తున్నారని ఆమె విమర్శించారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో పెద్ద జీతగానిగా ఉండే పల్లాకు ఓటేద్దామా, సీనియర్ జర్నలిస్ట్‌గా రాజకీయ పరిణతి ఉన్న మీ ఆడబిడ్డనైన నాకు ఓటేస్తారా.. మీరే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముందన్నారు.
పదవులపై మోజు తప్ప టీఆర్ఎస్‌కు అభివృద్ధి తెలియదని ఆమె ఆరోపించారు. టీఆర్ఎస్ పాలనలో ప్రశ్నించే గొంతుకలను అనగదొక్కుతున్నారని అన్నారు. మీ ఓటు ద్వారా టీఆర్ఎస్‌ను ఓడించి తగిన బుద్ధి చెప్పాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత జిట్టా బాలకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షులు చింతల లక్ష్మీ నారాయణ, క్రాంతిరెడ్డి, భాస్కర్, నవీన్, సంతోష్ రెడ్డి తదితరులు ఉన్నారు.