- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
90 శాతం క్షీణించిన అశోక్ లేలాండ్ విక్రయాలు
దిశ, వెబ్‌డెస్క్: హిందూజా గ్రూపునకు(Hinduja Group) చెందిన ప్రధాన కంపెనీ అశోక్ లేలాండ్(Ashok Leyland) బుధవారం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 389 కోట్ల నష్టాలను నమోదు చేసింది. బలహీనమైన ఆర్థిక కారకాల(Weak financial reasons)తో పాటు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరిమిత కార్యకలాపాల వల్ల సంస్థ నష్టాల(Losses)ను నమోదు చేసినట్టు కంపెనీ వెల్లడించింది.
దేశంలోనే రెండో అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీ సంస్థ(Commercial Vehicle Manufacturer) అయిన అశోక్ లేలాండ్(Ashok Leyland) ఏకీకృత ఆదాయం 77 శాతం క్షీణించి రూ. 1,486 కోట్లకు పడిపోయిందని తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి స్వతంత్ర ఆదాయం 89 శాతం తగ్గి రూ. 651 కోట్లకు చేరుకుంది. కొవిడ్-19 ప్రభావంతో పరిశ్రమ(Industry)కి అత్యంత సవాలుగా మారింది.
దీంతో సంస్థ ఆర్థిక పనితీరు(Financial performance) ప్రతికూలంగా ప్రభావితమైనట్టు అశోక్ లేలాండ్ మేనేజింగ్ డైరెక్టర్ విపిన్ తెలిపారు. ఇక, దేశీయంగానూ, ఎగుమతుల్లోనూ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ 3,814 యూనిట్ల వాణిజ్య వాహనాల(Commercial vehicles)ను మాత్రమే విక్రయించింది. గతేడాదితో పోలిస్తే ఇది 90 శాతం క్షీణత. అలాగే, భారీ వాణిజ్య వాహనాల అమ్మకాలు 96 శాతం, తేలికపాటి వాహనాల అమ్మకాలు 78 శాతం క్షీణించినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్(Regulatory Filing)లో కంపెనీ వెల్లడించింది.