- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత బలవన్మరణం
దిశ, పటాన్ చెరు: అత్తింటి వేధింపులు తాళలేక ఓ గృహిణి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన పటాన్‌చెర్వు పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మంజీరా నగర్ కాలనీ బీరంగూడ గ్రామం అమీన్ పూర్ కు చెందిన సజ్జ శివయ్య కూతురు సరిత (26)ను గతేడాది ఆగస్ట్ లో మండలంలోని లక్దారం గ్రామానికి చెందిన రాఘవేందర్ కు ఇచ్చి వివాహం చేశారు. అప్పటి నుంచి సరిత భర్త, అత్త లక్ష్మి, ఆడపడుచు రజిత అదనపు కట్నం తీసుకురావాలని డిమాండ్ చేయడంతో పాటు అందంగా లేవంటూ మానసికంగా, శారీరకంగా ఆమెను హింసించారు.
ఈ విషయంలో పలుమార్లు సరిత తల్లిదండ్రులు ఆమె అత్తకు నచ్చజెప్పినప్పటికీ తమ ప్రవర్తన మార్చుకోకుండా వేధించసాగారు. దీంతో సరిత ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సరిత ఆత్మహత్యకు భర్త, అత్త, ఆడపడుచుకారణమని మృతురాలి అన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.