- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సౌత్ ఇండస్ట్రీని చూసి బాలీవుడ్ నేర్చుకోవాలి
దిశ, వెబ్‌డెస్క్: కామెడీ టైమింగ్‌తో అదరగొట్టే బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి రీమేక్‌ల విషయంలో బాలీవుడ్ అనుసరిస్తున్న విధానంపై సంచలన కామెంట్ చేశాడు. క్రియేటివిటీకి లిమిట్స్ ఉండవని, భాష, మతం అడ్డురాదని నమ్ముతానన్న అర్షద్.. ప్రజలను అలరిస్తున్నంత వరకు రీమేక్ సినిమాలు, సిరీస్‌లు చేయడం మంచిదే అన్నారు. సౌత్ ఇండస్ట్రీ, బాలీవుడ్ నుంచి ఎలా ప్రేరణ పొందుతుందో.. అలాగే దక్షిణ సినీ పరిశ్రమ నుంచి కూడా హిందీ చిత్ర పరిశ్రమ స్ఫూర్తి పొందుతుందని.. ఇది మంచి పరిణామమేనని అభిప్రాయపడ్డారు.
సౌత్ ఇండస్ట్రీ వినూత్నంగా ఆలోచిస్తుందని, అవకాశం తీసుకుంటుందని చెప్పాడు. కొత్త కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రిస్క్ అయినా సరే ట్రై చేస్తుందని తెలిపాడు. ఆ విషయం తనను ఆకట్టుకుందన్నారు అర్షద్. దురదృష్టవశాత్తు బాలీవుడ్ అలాంటి ప్రయత్నాలు చేయడం లేదని.. చాలా సేఫ్ గేమ్ ప్లే చేస్తుందన్నారు. రొటీన్ వర్క్, రొటీన్ స్క్రిప్ట్‌కే స్టిక్ అయిపోయిందన్నారు. ఒక వేళ సరికొత్త స్టోరీ లైన్స్‌తో సౌత్ సినిమాలు సక్సెస్ అయితే ఇక్కడ ప్రాజెక్ట్ టేకప్ చేస్తుందే తప్ప చాన్స్ తీసుకునేందుకు ముందుకు రావడం లేదన్నారు. ఇది నిజంగా విచారకరమని.. బాలీవుడ్ ఇండస్ట్రీ మరింత ధైర్యంగా ముందుకు సాగాలని కోరుకున్నారు. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందన్నారు అర్షద్. అర్షద్ నటించిన ‘భాగమతి’ రీమేక్ ‘దుర్గామతి’ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయింది.