- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
డబుల్ వీసాలతో విదేశాలకు మహిళలు.. ఎయిర్ పోర్ట్ పోలీసుల అదుపులో 44 మంది..

X
దిశ, శంషాబాద్: డబుల్ వీసాలతో విదేశాలకు వెళ్ళుతున్న 44 మంది మహిళలను అదుపులోకి తీసుకున్న ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో జరిగింది. ఆర్జీఐఏ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిరిగేషన్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కువైట్ వెళ్తున్న ప్రయాణికులపై అనుమానం వచ్చి తనిఖీలు నిర్వహించగా 44 మంది మహిళలు డబుల్ వీసాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు.
ఆ మహిళల వద్ద ఎంప్లాయిమెంట్, విజిట్ వీసాలు కలిగి ఉన్నట్లు ఇమిరిగేషన్ అధికారులు గుర్తించారు. 44 మంది మహిళలు ఇమిరిగేషన్ అధికారులు అప్పగించారని ఆ మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. వారికి ఎవరు ఇచ్చారు ఎక్కడినుండి వీసాలు పొందారు అనే కోణంలో విచారిస్తున్నామని అన్నారు. ఈ మహిళలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గోవా లకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
Next Story