అరవింద్ కేజ్రీవాల్ పాట ఎక్కడిది?

by Shamantha N |
అరవింద్ కేజ్రీవాల్ పాట ఎక్కడిది?
X

ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాటపాడారు. ‘హమ్ హోంగే కామియాబ్’ పాటతో తన ప్రమాణ స్వీకారాన్ని ముగించారు. ఇంతకీ ఈ పాట ఎక్కడిదన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా జరుగుతున్నది. ఈ పాట మూలాలు అమెరికా సివిల్ మూవ్‌మెంట్‌లో ఉన్నాయి. ‘వీ షల్ ఓవర్‌కమ్’ అనే గాస్పెల్ పాటనే 1960లలో అమెరికాలో ఉధృతమైన సివిల్ మూవ్‌మెంట్‌లో ఒక ఆందోళన పాటగా మారింది. ఆ పాటను హిందీ కవి గిరిజ కుమార్ మాథుర్.. ‘హమ్ హోంగే కామియాబ్’గా అనువాదం చేశారు.

ఇలా పాటపాడటం అరవింద్ కేజ్రీవాల్‌కు ఇది మొదటిసారి కాదు. అంతెందుకు గతంలోనూ రెండు సార్లూ సీఎంగా ప్రమాణం తీసుకుంటూ పాట పాడారు. ‘ఇన్సాన్ కో ఇన్సాన్ సే బేచారా’ అనే దేశభక్తి గీతాన్ని పాడి వినిపించారు. ఈ పాట పైగామ్ అనే హిందీ సినిమాలోనిది. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కాలంలోనూ అరవింద్ కేజ్రీవాల్ ఈ పాట తరుచూగా పాడేవారు.

Advertisement

Next Story

Most Viewed